The Raja Saab Pre Release Event: సీనియర్స్ తర్వాతే మేము.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ వ్యాఖ్యలు

కల్కి 2898 ఏడీ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ది రాజా సాబ్. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ మూవీ చేస్తున్నారు. అలాగే హార్రర్ - కామెడీ జోనర్‌లో ప్రభాస్ తొలిసారిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ది రాజా సాబ్‌కి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజా సాబ్ విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో డిసెంబర్ 27న హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్స్‌లో ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

ది రాజా సాబ్ తారాగణం
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ది రాజా సాబ్ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ది రాజా సాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు.

The Raja Saab Pre Release Event Prabhas comments on Mega Star Chiranjeevi

ఇది నానమ్మ- మనవడి కథ
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ మాట్లాడుతూ.. నాకు సుమ గారంటే చాలా ఇష్టం. ఆవిడ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆవిడ జోష్ ఇస్తూనే ఉంటారు. జపాన్ వెళ్లినప్పుడు చాలా చేశా.. మీకు నచ్చిందని పిలక కూడా వేసుకున్నాను. ఈ చలిలో ఇంతమంది వచ్చారు.. చూసుకోండి జాగ్రత్తగా ఉండండి. అనిల్ తడానీ నా బ్రదర్.. బాంబేలో మన సినిమాలన్నీ చేస్తాడు. ఆయనే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశాడు. సంజయ్ సార్.. మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు, క్లోజప్ పెడితే మొత్తం తినేస్తారు. మారుతి గారు ఒక క్లిప్ చూపించారు. నానమ్మ- మనవడి కథే రాజాసాబ్ అన్నారు.

ఈ సినిమాకి హీరో ఆయనే
సినిమాలో నానమ్మ సీన్లు చూసి నా సీన్స్ మరిచిపోతున్నాను. నేను మా నానమ్మ ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాలో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో. మన హీరోయిన్లు మోస్ట్ బ్యూటీఫుల్. రిధి.. వెరీగుడ్ పర్ఫార్మర్, చాలా కష్టపడి చేసింది సినిమా. మాళవిక రెండున్నర సంవత్సరాల పాటు సినిమా కోసం కష్టపడింది. నిధి అంటే సెట్‌లో అందరికీ ఫేవరెట్. పాజిటివ్, కామ్ తన పని తాను చేసుకుంటూ ఉండేది.. నైస్ పర్సన్. సాల్మన్ మాస్టర్ ఐ లవ్ యూ. ఈ సినిమాకు హీరో విశ్వప్రసాద్ గారు.. ఎందుకంటే మూడు సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి. మారుతిగారు ఏదో తీశారు, రాశారు. విశ్వగారు మూడు సంవత్సరాలు.. మేం భయపడ్డాం కానీ, ఈయన అసలు భయపడడే. ఆ ధైర్యం ఏంటి సార్. ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు. మీరు, మీ వైఫ్, మీ ఫ్యామిలీ ఏం తిన్నారు.. కొంచెం మాకు కూడా చెబితే. సీరియస్‌గా చెబుతున్నా రాజా సాబ్‌కి హీరో విశ్వప్రసాద్ గారు.

థమన్ చేతుల్లో పెడుతున్నా
ఈ లెవల్ ఆర్ఆర్ మన ఇండియాలో ఇచ్చేవాడు ఎవరున్నారు థమన్ ఒక్కడే. నేను కూడా థమన్‌లా సూట్ వేసుకుని రాలేకపోతున్నాను ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందో. చాలా సీరియస్‌గా అన్ని రెడీ చేసుకుంటాను.. కబోర్డ్‌లో 200 వందల బట్టలు ఉంటాయి. సర్లే ఎందుకులే మరి ఓవర్‌గా ఉంటుందేమో. థమన్ డార్లింగ్ థ్యాంక్యూ. నీ చేతుల్లో పెడుతున్నాం.. డీవోపీ కార్తీక్ గారు. మారుతి స్పీడుకి, ఆయన క్వాలిటీ టూ గుడ్. కార్తీక్ సార్‌కి థ్యాంక్యూ. సాల్మన్ మాస్టర్, రామ్ - లక్ష్మణ్ మాస్టర్‌లు ఫైట్స్ ఇరగదీశారు అని ప్రభాస్ ప్రశంసించారు.

సీనియర్స్ తర్వాతే మేము
3 సంవత్సరాలు.. స్ట్రెస్, పెయిన్ బాధ్యత అన్నీ కలిసొచ్చేశాయి. ఫస్ట్ మారుతి గారిని కలిసి.. మన ఫ్యాన్స్‌కి చాలా సంవత్సరాలు అయిపోయింది, అన్ని డిష్యుం, డిష్యుంలు అయిపోతున్నాయి, సీరియస్ అయిపోతోంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఏదో చేయాలని చెప్పాను. అలా ప్లాన్ చేస్తే ఫైనల్‌గా మార్వెల్ కామెడీతో సెట్ అయ్యింది. మేం ఎడిగితే దానికి విశ్వప్రసాద్ గారు రెడీ రెడీ అంటున్నారు. కథ ఒక ఫేస్‌కి వెళ్లింది, నేనైతే మారుతిగారి రైటింగ్‌కి ఫ్యాన్ అయిపోయాను. క్లైమాక్స్ పెన్‌తో రాశాడో, మెషిన్ గన్‌తో రాశాడో. ఇప్పటి వరకు క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి. మనకి 15 ఏళ్ల మారుతి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. అది సంక్రాంతికి వస్తుంది మరి. సంక్రాంతి సినిమాలు అన్ని బ్లాక్‌బస్టర్ కావాలి. వెరీ ఇంపార్టెంట్ సీనియర్.. సీనియరే. సీనియర్స్ దగ్గరి నుంచి నేర్చుకున్నదే మేము. సీనియర్స్ తర్వాతే మేము 100 పర్సెంట్. సంక్రాంతికి అన్ని బ్లాక్ బస్టర్స్ కావాలి. ఈరోజు చాలా ఎక్కువగా మాట్లాడాను. ఏదో ఒక రోజు ఇంకా ఇరగదీస్తా. రేపు ది రాజా సాబ్ ట్రైలర్ చూడండి. విశ్వప్రసాద్ గారి బడ్జెట్.. ఈయన మెంటల్ అన్ని దాంట్లో తెలుస్తాయని ప్రభాస్ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Read more about: the raja saab prabhas chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X