ప్రభాస్ ‘ది రాజా సాబ్' సినిమాపై ఆ రూమర్లు.. దిమ్మతిరిగిలా మేకర్స్ క్లారిటీ
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas)నటిస్తున్న భారీ హారర్-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ది రాజా సాబ్ (The Raja Saab).కల్కి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడం, మాస్, యాక్షన్ జోనర్‌లో తెరకెక్కడం, ఎప్పుడు లేని విధంగా హార్రర్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ నటించడం. ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో అత్రుతగా చూస్తున్నారు. అయితే.. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సినిమా రిలీజ్ వాయిదా పడుతుందా?, ఆన్‌లైన్ డీల్స్ తక్కువ రేటుకు అమ్మేశారా? అనే కథనాలు అభిమానుల్లో టెన్షన్ పెంచాయి. ఈ నేపథ్యంలో తాజా గా మేకర్స్ స్పందించి, ఆ రూమర్లన్నింటికీ గట్టి చెక్ పెట్టారు. ఇంతకీ ఏమన్నారంటే?
దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న థియేటర్లలో విడుదల కానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ గత కొద్ది రోజులుగా రిలీజ్ వాయిదా అనే ప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన నిర్మాణ సంస్థ పిపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) స్పందించి ' ఈ రూమర్లను నమ్మొద్దు. షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సరైన సమయం వచ్చినప్పుడు అప్‌డేట్స్ మేమే అధికారికంగా ప్రకటిస్తాం'అంటూ స్పష్టత ఇచ్చింది.

తాజాగా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad)'ది రాజా సాబ్' ఆన్‌లైన్ రైట్స్, బాక్సాఫీస్ లెక్కలపై జరుగుతున్న చర్చలకు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. 'మా సినిమా వ్యాపారం గురించి అనవసర పోలికలు అవసరం లేదు. అంతర్గత ఖర్చులు, లెక్కల గురించి మేము బహిరంగంగా చర్చించం. మాకు, అభిమానులకు నిజంగా ముఖ్యమైనది థియేటర్లలో సినిమా ప్రభావమే. సినిమా విడుదలైన తర్వాతే ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ గణాంకాలను అధికారికంగా వెల్లడిస్తాం" అని స్పష్టం చేశారు.
అలాగే, "ప్రస్తుతం నాన్-థియేట్రికల్ మార్కెట్ డీల్ జరుగుతోంది. అయినప్పటికీ ఈ దశలో కూడా మా సినిమా అత్యధికంగా సాధ్యమైన నాన్-థియేట్రికల్ విలువను అందుకుంది. పోలికలు అనవసరం. 'ది రాజా సాబ్' అనేది థియేటర్లలో గర్జించడానికి రూపొందించిన భారీ హారర్-ఫాంటసీ మూవీ. స్క్రీన్లే మాట్లాడనివ్వండి'అంటూ మేకర్స్ కాన్ఫిడెన్స్‌ను చాటారు.
ఇటీవల హైదరాబాద్ లూలూ మాల్‌లో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వప్రసాద్ మరో కీలక అప్డేట్ ఇచ్చారు. జనవరి 8న, అంటే రిలీజ్‌కు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ షోలు ఉంటాయని ప్రకటించారు. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ఓపెన్ గ్రౌండ్స్‌లో భారీ స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ను స్టేజ్‌పై చూడబోతున్నామన్న మాటతో అభిమానుల్లో హైప్ పెరిగింది.
రాజాసాబ్ మూవీలో ప్రభాస్ విభిన్నమైన పాత్రల్లో కనిపించనుండగా, ఆయన సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనుండగా, బొమన్ ఇరాని, బ్రహ్మానందం, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మ్యూజిక్ మాస్ట్రో ఎస్ తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇలా 'ది రాజా సాబ్'పై వస్తున్న అన్ని రూమర్లకు మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సంక్రాంతి 2026 బరిలో ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలని ట్రేడ్ వర్గాలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











