అతని చుట్టూనే ది రాజా సాబ్‌ స్టోరీ.. ప్రభాస్‌నే డామినేట్ చేసేలా... లీక్ చేసిన డైరెక్టర్

కల్కి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ది రాజా సాబ్. మాస్, యాక్షన్ జోనర్‌లకు దూరంగా హార్రర్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ నటిస్తున్నారు. కామెడీ, కుటుంబ కథా చిత్రాల స్పెషలిస్ట్ మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజా సాబ్‌కు సంబంధించిన ఈ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ది రాజా సాబ్ తారాగణం
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ది రాజా సాబ్ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

The Raja Saab Sanjay Dutt s Powerful Role to Steal the Show in Prabhas film

ది రాజా సాబ్ బడ్జెట్ ఎంత?
ది రాజా సాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజా సాబ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ది రాజా సాబ్‌కు 450 కోట్ల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమా రిలీజ్ అయ్యే నాటికి బడ్జెట్‌లో మార్పుచేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ది రాజా సాబ్‌పై భారీ అంచనాలు
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ది రాజా సాబ్ యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే రెండు టీజర్లతో పాటు విడుదల చేయగా.. రెండు పాటలను విడుదల చేశారు మేకర్స్. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అదే ఈవెంట్‌లో రాజా సాబ్ నుంచి అదిరిపోయే ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని ఫిలింనగర్‌లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు.. దర్శకుడు మారుతి కూడా తనదైన శైలిలో ప్రమోషనల్ కార్యక్రమాలను ప్లాన్ చేస్తూ వాటిలో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలను ఓ వీడియోలో పంచుకున్నారు మారుతి.

ఆయన చుట్టూనే సినిమా
సంజయ్ దత్ గారు ఈ సినిమాలో చాలా కీ రోల్ ప్లే చేశారు. ఈ రోల్‌లో ఆయన ఫ్లాష్‌బ్యాక్‌లో ఒకలా కనిపిస్తారు. యంగ్, మిడిల్ ఏజ్, నెక్ట్స్ ఓల్డ్.. ఇలా మూడు వెరియేషన్స్‌లో కనిపిస్తారు. అలాగే ఇందులో ఘోస్ట్‌ రోల్ కూడా ప్లే చేశారు. సంజయ్ దత్ గారిని మనం ఇప్పటి వరకు ఒక విలన్‌గానూ, ఒక హీరోగానూ బాలీవుడ్ సినిమాలలో రకరకాలుగా చూశాం. కానీ మన తెలుగు ఆడియన్స్‌కి కానీ, పాన్ ఇండియాకి కానీ ఈ తరహా రోల్‌లో ఇంతవరకు చూడలేదు. మూడు వెరియేషన్స్ సంగతి పక్కనపెడితే.. మన ఇంట్లో రోజూ చూసే ఒక వ్యక్తిలాగా సంజయ్ దత్ గారు అనిపిస్తారు అని మారుతి చెప్పారు.

ఆ రోల్ గుర్తుండిపోతుంది
ఈ సీన్స్ అన్నింటిలోనూ చిన్న చిన్న విషయాలను కూడా చాలా బాగా చేశారు. సంజయ్‌ దత్ గారి లాంటి ఒక లెజెండ్‌తో వర్క్ చేయడం నా అదృష్టం. మా సినిమాకి పెద్ద అసెట్ అంటే ప్రభాస్ గారి తర్వాత సంజయ్ దత్‌గారే. రేపు బాలీవుడ్‌లో ఈ సినిమా చూసిన తర్వాత సంజయ్ దత్ గారు మాత్రం గుర్తుండిపోతారు అని మారుతి తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ప్రభాస్‌నే డామినేట్ చేసేలా సంజయ్ దత్ క్యారెక్టర్ ఉండబోతోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: the raja saab sanjay dutt prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X