ప్రభాస్ ఫోటో జేబులో ఉంటే.. ఆ డైరెక్టర్ జీవితం అంతే..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ది రాజాసాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ గా సంక్రాంతి 2026కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు, ప్రీ లుక్ కు ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'రెబల్ సాబ్' అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
'ది రాజాసాబ్' ఫస్ట్ సాంగ్ కోసం హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో ప్రత్యేక లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అభిమాన మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనూహ్యంగా టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడంతో పాట ప్రకటించిన సమయానికి విడుదల కాలేదు. కొద్దిసేపటి ఆలస్యానికే ట్రాక్ డ్రాప్ కాగా, విడుదల తర్వాత స్పందన భారీ గా పెరిగింది. రొమాంటిక్ హారర్-కామెడీ థ్రిల్లర్ జానర్‌లో వస్తుండటంతో, మాస్ ఎంటర్‌టైనర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌లో భారీ బజ్ నెలకొంది. ఇండస్ట్రీలో కూడా ప్రభాస్ మానరిజం, మాస్ ఎనర్జీని తిరిగి చూపించే సినిమాగా 'ది రాజాసాబ్'పై చర్చ జరుగుతోంది.

ఈ చిత్రంలో మాళవిక మోహన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ త్రయీ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రతీ హీరోయిన్‌తో ప్రభాస్ కెమిస్ట్రీ ప్రత్యేకమంట. తమన్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే కంపోజ్ చేసిన కొన్ని బిట్స్ టీమ్‌ను బాగా ఇంప్రెస్ చేశాయని సమాచారం. ఈవెంట్‌లో దర్శకుడు మారుతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానుల ముందే ఆయన ప్రభాస్‌పై ఉన్న తన అభిమానాన్ని పంచుకున్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. "అభిమానుల ముఖాల్లో నవ్వు చూడటానికి కష్టపడుతున్నాం. అది చిన్న కష్టం కాదు... కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల సాంగ్ లాంచ్ కొంచెం లేట్ అయింది. అన్నీ పర్ఫెక్ట్‌గా చూసి చేతికొచ్చేవరకు టైమ్ చెప్పొద్దని మా వాళ్లకి చెప్పినా... వాళ్లు టైమ్ వేశారు. రేపు పండగలా ఎంజాయ్ చేస్తారు. కాలర్ ఎగరేయండి అని నేను చెప్పను. ఎందుకంటే ప్రభాస్ కటౌట్‌కి ఆ మాటలు చిన్నవిగా ఉంటాయి." అని భారీ హైప్ క్రియేట్ చేశారు.
డైరెక్టర్ మారుతి ఇంకా మాట్లాడుతూ.. "మీ మనసులో నుంచి 'రెబల్ గాడ్', 'రెబల్ వుడ్' అని ఆయన ఎలా వచ్చారో గాని... నేను ప్రస్తుతం ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా. రెండేళ్ల క్రితం ఆయన తన యూనివర్శిటీలోకి నన్ను జాయిన్ చేసుకున్నారు. నేనేదో చిన్న కాలేజీలో చదువుకునేవాడిని. 'నీకు టాలెంట్ ఉంది, నా యూనివర్శిటీకిరా' అన్నాడు. అక్కడ నాకు అర్హత ఉందో లేదో తెలియదు. కానీ వెళ్లిన తర్వాత మాత్రం ఆయనను అర్థం చేసుకున్నా. ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పని చేశా. ఆయన ఫోటో ఉంటే ఎలాంటి వాడైనా టాప్ డైరెక్టర్ అవుతాడు. అందులో డౌటే లేదు." అన్నారు.
ప్రభాస్ వ్యక్తిత్వంపై మారుతి మరింత ఎమోషనల్‌గా మాట్లాడారు. "ప్రభాస్‌ది కల్మషం లేని మనస్తత్వం. ప్రేమతో దగ్గర చేర్చుకుంటాడు. రెండు సంవత్సరాల జర్నీ చేశాను. ఉదయం లేస్తే ఆయన వాయిస్ మెసేజులు చూస్తున్నా. నేను అదృష్టవంతుడిని అనిపిస్తుంది. నేను ఈరోజు మీకు ప్రామిస్ చేస్తున్నా.. 'ది రాజాసాబ్' చూస్తే మీరు అరిచి అరిచి గొంతులు పోతాయి. ప్రతి క్షణం ఆయన ఇచ్చిన ఎక్సైట్మెంట్ సినిమా మొత్తం కనిపిస్తుంది" అని భారీ అంచనాలు పెంచేశారు.
మారుతి ఇంకా మాట్లాడుతూ.. " ప్రభాస్ 12 సంవత్సరాల తర్వాత ఇలాంటి పాట చేశారంటే మన కోసమే. ప్రభాస్‌ను ఇలాంటి సాంగ్స్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఎంత మిస్ అయ్యారో... ఈ సినిమాలో ఆయన ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది' అని చెప్పుకొచ్చారు. మొత్తంగా 'ది రాజాసాబ్' ప్రమోషన్స్, మారుతి చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. సంక్రాంతి కానుకగా జనవరి 2026లో రానున్న ఈ చిత్రం, ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు మళ్లీ కొత్త జోష్ తీసుకురాబోతుందనే నమ్మకం అభిమానుల్లో బలపడుతోంది.


Click it and Unblock the Notifications











