Rajasaab: రాజాసాబ్ పార్ట్ 2 ఫిక్స్?.. ఆ మ్యాటర్ లీక్ చేసిన మూవీ మేకర్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ (The Rajasaab) రిలీజ్‌కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. వచ్చే శుక్రవారమే ఈ సినిమా థియేటర్లలోకి రానుండటంతో ప్రభాస్ అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ కీలక మ్యాటర్ ను లీక్ చేశారు మూవీ మేకర్స్. ఇంతకీ సంగతేంటీ?
కామెడీ సినిమాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతి ఈ మూవీకి డైరెక్ట్ చేయగా, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు హారర్ కామెడీ అంశాల మేళవింపుతో, భారీ గ్రాఫిక్స్, పాన్ ఇండియా స్థాయి మేకింగ్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీకి మ్యూజిక్‌ను ఎస్ థమన్ అందిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, ప్రభాస్‌కు తాతగా కీలక పాత్రలో కనిపించనున్నారనే విషయం ఇప్పటికే సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.

ఇక 'ది రాజాసాబ్' ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు మారుతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్, ట్రైలర్‌లో కనిపించిన ప్రభాస్ జోకర్ లుక్ గురించి ప్రశ్నించాడు. సాధారణంగా స్టార్ హీరోలు ఐకానిక్ క్యారెక్టర్స్‌ను రీపీట్ చేయడానికి వెనుకాడుతారని, అలాంటిది ప్రభాస్‌ను ఆ లుక్‌కు ఎలా ఒప్పించారు అని ప్రశ్నించగా.. మారుతి మాట్లాడుతూ, 'ప్రభాస్ జోకర్ లుక్‌కు సంబంధించిన కథ చాలా పెద్దది. ఆ కథ మొత్తం ది రాజాసాబ్ పార్ట్ 2లో ఉంటుంది. ఆ లుక్‌కు ఉన్న ప్రాధాన్యతను ప్రభాస్‌కు వివరించాకే ఆయన ఓకే చెప్పారు' అని తెలిపారు.
ఈ ఒక్క మాటతోనే, మారుతి అనుకోకుండా 'ది రాజాసాబ్'కు సీక్వెల్ కూడా ఉంటుందనే విషయాన్ని లీక్ చేసినట్లయ్యింది. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ప్రభాస్ చేస్తున్న సినిమాలను పరిశీలిస్తే.. సీక్వెల్స్ విషయంలో ప్రభాస్ టాప్‌లో ఉన్నారని చెప్పాలి. ఇప్పటికే సలార్ - పార్ట్ 2, కల్కి 2898 ఏడి -పార్ట్ 2 లైన్‌లో ఉండగా, ఇప్పుడు ది రాజాసాబ్ 2 కూడా ఆ జాబితాలో చేరడం అభిమానులకు డబుల్ ట్రీట్‌లా మారింది. ఈ సీక్వెల్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది ఇంకా స్పష్టత లేకపోయినా, ఈ అప్డేట్స్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తున్నాయి.
ది రాజాసాబ్ 2 పై నిర్మాత క్లారిటీ
ఇదిలా ఉండగా, గతంలో ఈ సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'ది రాజాసాబ్ 2 తప్పకుండా ఉంటుంది. కానీ అది మొదటి భాగానికి డైరెక్ట్ సీక్వెల్ కాదు' అని ఆయన స్పష్టం చేశారు. మొదటి సినిమాలోని హారర్ కామెడీ నేపథ్యాన్ని కొనసాగిస్తూ, కొత్త కథతో ఈ సినిమాను ఫ్రాంచైజీగా తీసుకెళ్తామని తెలిపారు. ఇది సలార్, కల్కి తరహాలో మరో ప్రత్యేకమైన ప్రభాస్ బ్రాండ్‌గా మారే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇలా మొత్తానికి 'ది రాజాసాబ్' కేవలం ఒక్క సినిమాతో ఆగకుండా, ఓ ఫ్రాంచైజీగా మారే దిశగా అడుగులు వేస్తుందన్నది ఇప్పుడు స్పష్టమవుతోంది. డైరెక్టర్ మారుతి మాటలు, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ క్లారిటీ, ప్రభాస్ సీక్వెల్ ట్రాక్ రికార్డ్ అన్ని కలిసి చూస్తే.. ది రాజాసాబ్ పార్ట్ 2 ఫిక్స్ అయినట్టే అన్న టాక్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక సంక్రాంతి బరిలో నిలిచిన ప్రభాస్ రాజాసాబ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో.. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతుందని అని డార్లింగ్ ఫ్యాన్స్ అత్రుతగా వేచిచూస్తారు.


Click it and Unblock the Notifications











