చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణతో మారుతి.. రాజాసాబ్ డైరెక్టర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ (The Rajasaab)పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్‌ను జోరుగా ప్రారంభించగా, విడుదలైన టీజర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టాయి. ఇక ది రాజాసాబ్ ప్రమోషన్స్ భాగంగా దర్శకుడు మారుతి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను బయటపెట్టారు. డైరెక్టర్ ప్లానింగ్ తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే..
'ఈ రోజుల్లో' అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మారుతి, ఆ తర్వాత వరుసగా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. బస్ స్టాప్, కొత్త జంట, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండగే, పక్కా కమర్షియల్ లాంటి సినిమాలతో సక్సెస్ ట్రాక్‌లో కొనసాగిన మారుతి, ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో పాన్ ఇండియా స్థాయి సినిమా చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ప్రభాస్ తొలిసారి హారర్ జానర్‌లో నటిస్తుండటం, అది కూడా సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ కావడం వల్ల 'ది రాజాసాబ్'పై బజ్ మరింత పెరిగింది.

ఇటీవల 'ది రాజాసాబ్' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి, తన క్యారెక్టర్ డిజైన్, సినిమా మేకింగ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'భలే భలే మగాడివోయ్' సినిమాలో హీరో క్యారెక్టర్‌ను తన జీవితంలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా డిజైన్ చేశానని వెల్లడించారు. తాను సాధారణంగా తన చుట్టూ ఉన్న వ్యక్తుల స్వభావాలు, రోజువారీ జీవితంలో జరిగే సంఘటనల నుంచే పాత్రలను రూపొందిస్తానని చెప్పారు. అలాగే తన సినిమాల్లో కొన్ని డైలాగ్స్ ముందే రాసుకోకుండా, షూటింగ్ సమయంలో ఫ్లోలో వచ్చేవే ఉంటాయని తెలిపారు.
'ది రాజాసాబ్' తర్వాత మారుతి పూర్తిగా పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోతారా? లేక మళ్లీ చిన్న హీరోలతో సినిమాలు చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతోంది.'నేను ఎవ్వరినీ ఫాలో కావాలనుకోను. నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనేదే నా లక్ష్యం. 'ది రాజాసాబ్' సినిమా తీయడానికి ప్రభాస్ గారు ఇచ్చిన ఎనర్జీ నా స్ట్రెంత్ ఏంటో నాకు అర్థమయ్యేలా చేసింది. ఆయన ఇచ్చిన ఈ ప్లాట్‌ఫామ్‌ను నేను ఖచ్చితంగా ఉపయోగించుకుంటా. పాన్ ఇండియా, లోకల్ అనే తేడా లేకుండా నా మనసుకు నచ్చిన సినిమాలే చేస్తాను' అని మారుతి స్పష్టంగా చెప్పారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో మారుతి బయటపెట్టిన డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే నిజంగానే సినీ అభిమానులకు 'మైండ్ బ్లాక్' అనిపించేలా ఉంది. తాను ' పంచతంత్రం' సినిమా తరహా కథతో భారీ మల్టీస్టారర్ సినిమా తీయాలనుకుంటున్నానని వెల్లడించారు. ఆ సినిమా రిలీజ్ అయిన రోజే బాక్సాఫీస్ షేక్ కావాలని తన కోరికగా చెప్పారు. అంతేకాదు, ఆ ప్రాజెక్ట్‌లో తెలుగు ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో పాటు తమిళ స్టార్ కమల్ హాసన్ ను కలిపి ఒకే సినిమాలో చూపించాలనేదే తన డ్రీమ్ అని చెప్పారు. ఈ ఐదుగురు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీ అంటే అది ఇండస్ట్రీలో ఓ రికార్డుగా నిలవాలని తన ఆశగా తెలిపారు.
మారుతి చేసిన ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజంగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? అన్ని డేట్స్, కమిట్‌మెంట్స్ సెట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ అభిమానులు చర్చలు మొదలుపెట్టారు. ఒకవేళ ఈ మల్టీస్టారర్ సినిమా నిజమైతే, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అతిపెద్ద ఈవెంట్‌గా మారుతుందని, అన్ని బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవుతాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం మారుతి ఫోకస్ అంతా 'ది రాజాసాబ్' పైనే ఉన్నప్పటికీ, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ముందుగా ప్రభాస్‌తో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ ఎంతటి విజయం సాధిస్తుందో, ఆ తర్వాత మారుతి కలలు కంటున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్ నిజమవుతుందో చూడాలి. ఇప్పటికి మాత్రం 'ది రాజాసాబ్' సంక్రాంతి బాక్సాఫీస్‌పై భారీ ఆశల్ని మోస్తూ, ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











