The Rajasaab Public Talk: రాజాసాబ్‌ పబ్లిక్ టాక్..ప్రభాస్-మారుతి ప్రయోగం వర్కౌట్ అయ్యిందా?

The Rajasaab Public Talk: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా అంటే అభిమానులకే కాదు, సాధారణ ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలుంటాయి. ముఖ్యంగా 2024లో వచ్చిన కల్కి (Kalki 2898 AD) తో తన స్టార్‌డమ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన ప్రభాస్, 2025లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. దీంతో ప్రభాస్‌ను మళ్లీ వెండితెరపై ఎప్పుడు చూస్తామా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ఆ నిరీక్షణకు తెరదించుతూ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమానే ది రాజాసాబ్ (The Rajasaab).

కామెడీ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ మారుతి (Maruthi)దర్శకత్వంలో, ప్రభాస్ తొలిసారి హారర్-ఫాంటసీ-కామెడీ జానర్‌ను ట్రై చేయడం ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ భారీ బడ్జెట్ మూవీ జనవరి 9న (నేడు) గ్రాండ్ రిలీజ్ కాగా, ఒక రోజు ముందే ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్-మారుతి కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అయిందన్నదనే దానిపై అందరి దృష్టి.

The Rajasaab Public Talk Prabhas Horror Fantasy Film Gets Mixed Reviews on Day One

ఇంతకీ స్టోరీ ఏంటీ?
ఆస్తులన్నీ కోల్పోయిన జమీందారీ కుటుంబానికి చెందిన రాజు అలియాస్ రాజాసాబ్ (ప్రభాస్), మతిమరుపుతో బాధపడుతున్న తన నానమ్మ గంగమ్మ (జరీనా వాహబ్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. యవ్వనంలో అమ్మవారి నగలు తీసుకురావడానికి వెళ్లి తిరిగి రాని భర్త కనకరాజు ( సంజయ్ దత్) కోసం గంగమ్మ ఇంకా ఎదురుచూస్తూనే ఉంటుంది.

ఒక అనుకోని సంఘటనతో తన తాత ఫోటో కనిపించడంతో రాజాసాబ్ హైదరాబాద్‌కు వచ్చి అతడిని వెతకడం మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో రాజాసాబ్ బ్లెస్సీ(నిధి అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. అదే సమయంలో భైరవి (మాళవిక మోహనన్)కూడా రాజాసాబ్ కు దగ్గరవుతుంది. కనకరాజు-గంగరాజు (సముద్రఖని) మధ్య అసలు గొడవ ఏమిటి? నానమ్మ కోరికను రాజాసాబ్ నెరవేర్చుతాడా? అనేది స్టోరీ.

ప్రస్తుతం ది రాజాసాబ్ పబ్లిక్ టాక్ చూస్తే.. సినిమా మొత్తం మీద మిక్స్‌డ్ రివ్యూలే వినిపిస్తున్నాయి. కొందరు ప్రేక్షకులు సినిమాలో ల్యాగ్ ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతుంటే, మరికొందరు 'ఇది సినిమా కంటే సీరియల్‌లా ఉంది'అంటూ విమర్శిస్తున్నారు. దాదాపు మూడు గంటల రన్‌టైమ్ కొంతమందికి భారంగా అనిపించిందన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ మారుతి ఈ స్టోరీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని మరికొందరూ విమర్శిస్తున్నారు.

అయితే మరో వైపు.. రెబల్ స్టార్ ఇంట్రడక్షన్ సీన్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది 'వింటేజ్ ప్రభాస్ బ్యాక్' అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వీఎఫ్‌ఎక్స్ బాగున్నాయంటున్నారు. ముఖ్యంగా నానమ్మ ఎమోషన్‌కు సంబంధించిన సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ యాక్టింగ్ ఈ సినిమాలో వేరే లెవెల్‌లో ఉందని చెప్పేవాళ్లు కూడా తక్కువ లేరు.

ఇక సంజయ్ దత్ ఎంట్రీ సినిమాకు హారర్ టోన్‌ను బలంగా సెట్ చేసింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ హర్రర్ లెవల్ పెంచిందని టాక్ వినిపిస్తోంది. సెకండ్ హాఫ్‌లో హాస్పిటల్ సీన్ బాగా వర్కౌట్ అయిందనీ, చివరి 30 నిమిషాల క్లైమాక్స్ మాత్రం సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని అభిమానులు చెబుతున్నారు. ఇక ప్రభాస్ కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారిందని టాక్ . ఇక మ్యూజిక్ విషయానికి వస్తే థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. గూస్‌బంప్స్ తెప్పించేలా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే. సినీ విశ్లేషకులు మొదట ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుందని అంచనా వేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే 'రాజాసాబ్ 1500 కోట్లు కొల్లగొడుతుంది'అంటూ సోషల్ మీడియాలో హంగామా చేశారు. పోటీ పెద్దగా లేకపోవడంతో తొలి వారాంతం వరకూ భారీ వసూళ్లు ఖాయమనే అంచనాలు వినిపించాయి. కానీ థియేటర్లలోకి అడుగుపెట్టిన తర్వాత టాక్ కొంత రివర్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిక్స్‌డ్ రివ్యూలతో సినిమా ఎలా నిలబడుతుందన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ రోజు అన్ని షోస్ పూర్తయ్యాక అసలు ట్రెండ్ ఏంటన్నది తేలనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X