The RajaSaab Trailer Review: ది రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాళ విక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నది.

ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం విడుదలకు సర్వం సిద్దమైంది. ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ ఆదరణ లభిస్తున్నది. ఇలా రోజు రోజుకు క్యూరియాసిటీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది? ప్రభాస్‌ను బిగ్గెస్ట్ హారర్ థ్రిల్లర్‌లో ఎలా చూపించారనే వివరాల్లోకి వెళితే..
ది రాజాసాబ్ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. తాత మనవడు, నానమ్మ మనవడు మధ్య జరిగే ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంగా రూపొందిన కథ అని కంటెంట్ చెప్పకనే చెప్పాడు. అనేక ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న రాజాసాబ్ కుటుంబానికి మంచి రోజులు రావడానికి ముందు ఏం జరిగింది? గంగవ్వను వెంటాడే, జీవితంలో మరిచిపోలేనటు వంటి సంఘటన ఏమిటి? దాని కోసం మనవడు ఎలాంటి ఛాలెంజ్ ఎదుర్కొన్నాడనే విషయాన్ని ట్రైలర్ స్పష్టంగా చెప్పింది.
మయసభ లాంటి అతిపెద్ద పురాతన భవనంలోకి అడుగుపెట్టడమే గానీ.. బయటకు వెళ్లడానికి తాత సంతకం కావాలనే ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ అల్లుకొన్న హారర్, ఫాంటసీ ఎలిమెంట్స్ సినిమాను ఎప్పుడెప్పుడూ చూడాలన్న ఆసక్తిని క్రియేట్ చేసేలా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ కట్ చేసింది.
ది రాజాసాబ్ సినిమా కంటెంట్ మాత్రమే కాదు.. టెక్నికల్‌గా సౌండ్‌గా ఉంది. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ భారీగా ప్లాన్ చేశారు. ఈ సినిమా పురాతన భవనం సెట్టింగ్ ఈ సినిమాకు ఆకర్షణగా మారింది. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ ఎలా ఉంటుంది? , అలాగే విలన్‌గా సంజయ్ దత్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందనే విషయం ఈ ట్రైలర్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించాయి. ఈ సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్‌బస్టర్ అవ్వడానికి అన్ని హంగులు ఉన్నాయని ట్రైలర్ గొప్ప ఫీలింగ్ ఇచ్చింది. జనవరి 9వ తేదీన రానున్న ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ కోసం ఫిలింబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











