మన్మథుడు 2 సెట్స్‌పై రకుల్ రచ్చ! నాగ్, రాహుల్ కలిసి దాచేయాల్సిన పరిస్థితి

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న మన్మథుడు 2 సినిమాలో సీనియర్ హీరో నాగార్జునతో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెగ రొమాన్స్ చేసిందట. కుర్ర హీరోలను పక్కన బెట్టి సీనియర్ హీరో నాగార్జున చెంత చేరిన ఈ అమ్మడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిందట. మన్మథుడు పేరుకు తగ్గట్టుగా ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండేలా చేసుకున్నారట రాహుల్, నాగార్జున. అయితే ఈ సీన్స్ షూటింగ్ చేస్తుండగా సెట్స్ పై అల్లుకుపోయిన తీరు వారిరువురికి ఆశ్చర్య పర్చిందట. దీంతో రకుల్ స్పీడ్ ని క్యాచ్ చేసుకొని ఎలాగైనా సినిమాపై హైప్ తీసుకురావాలని మొన్నటి టీజర్ లో రకుల్‌ని కనిపించకుండా దాచేశారట.

'సాహూ' టీజర్ కి పోటీగా ఈ రోజే దిగిన 'మన్మథుడు 2' టీజర్ ఊహించిన దాన్ని మించిన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ టీజర్ చూసి రాజమౌళి సైతం ఫిదా అవుతూ అప్రిసియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ టీజర్ లో రకుల్ ప్రీత్ సింగ్ నేరుగా ఎక్కడా కనిపించలేదు. టీజర్ లో రొమాంటిక్ సీన్స్ ఉన్నపటికీ రకుల్ మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకు కారణం.. రకుల్ రొమాంటిక్ సీన్స్ తోనే సెపెరేట్ గా మరో టీజర్ వదలడానికేనట. ఈ మేరకు ఈ టీజర్ డిజైన్ చేసే పనిలో పడ్డారట నాగార్జున, రాహుల్ రవీంద్రన్.

The Reason Behind Rakul Not appeared in Manmadhudu 2 Teaser

రకుల్ పోషించిన అవంతి పాత్రతో ఈ టీజర్ కట్ చేసి.. మన్మథుడు 2 సినిమాలో ఆమెకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందనేది తెలుపుతారట. సీనియర్ హీరోతో రొమాన్స్ చేసినా కూడా రకుల్ క్యారెక్టరైజేషన్ డిఫెరెంట్ గా చూపించనుందట మన్మథుడు 2 యూనిట్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా రోజుల తర్వాత నాగార్జున లోని మన్మథుడిని చూడాలని ఈ సినిమాపై ప్రేక్షకులు ఫుల్లుగా ఆశలు పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X