కొరటాల ఆఫీస్‌లో రామ్ చరణ్.. అసలేం జరుగుతోంది? కారణమిదేనా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత బిజీగా ఉంటున్నాడో అందరికీ తెలిసిందే. ఇటీవలే 'సైరా' సినిమాను నిర్మించి అందరి చేత ప్రశంసలు పొందాడు. మరోవైపు రాజమౌళి RRR ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. అటు హీరోగా ఇటు నిర్మాతగా ఫుల్ జోష్‌లో ఉన్న చెర్రీ.. మరో సినిమాను నిర్మించేందుకు సిద్దమయ్యాడు.

చిరు 152.. మరోసారి రామ్ చరణ్
చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతోన్న చిత్రాన్ని కూడా రామ్ చరణ్ నిర్మించబోతోన్నాడు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని దసరా రోజున అధికారికంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలను నిర్వహించిన చిత్రయూనిట్.. డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

జోరుగా ప్రచారం కావడంతో
చిరు 152వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యిందంటూ ఫుల్‌గా ప్రచారం జరిగింది. ఈ మేరకు ఓ అభిమాని క్రియేట్ చేసిన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్శించింది. అది నిజమైన పోస్టర్ అనేంతంగా అందరూ నమ్మేశారు. దీంతో అది క్షణాల్లో వైరల్ అయింది.

ఖండించిన కొణిదెల ప్రొడక్షన్
చిరు 152 మూవీ టైటిల్, పోస్టర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ.. చివరకు కొణిదెల ప్రొడక్షణ్ వరకు చేరుకుంది. దీంతో వారు అది అధికారికమైంది కాదు.. టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు.. టైటిల్ ఖరారు చేశాక మేమే అధికారికంగా ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. దీంతో ఆ వార్తలకు పుల్‌స్టాప్ పడ్డట్లైంది.

సడెన్‌గా కొరటాల ఆఫీస్‌కు చెర్రీ
నిన్న (గురువారం) సాయంత్రం రామ్ చరణ్.. కొరటాల శివ ఆఫీస్‌కు వెళ్లినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ మేరకు ఓ పోస్ట్ చేస్తూ.. సడెన్‌గా కొరటాల ఆఫీస్‌కు వెళ్లాను.. లవ్ ది ఎనర్జీ.. చిరు 152 మూవీకి ఆల్ ది బెస్ట్.. అని తెలిపాడు.

కారణం ఇదేనా? ఫ్యాన్స్ కామెంట్స్
అయితే అలా సడెన్‌గా ఎందుకు వెళ్లుంటాడని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా గురించి మాట్లాడటానికే వెళ్లుంటాడని, ఇలా ఫ్యాన్ మేడ్ పోస్టర్‌లు వైరల్ అవుతుండటంపై గురించి చర్చించడానికి వెళ్లుంటాడని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాపై ఫుల్లుగా ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











