Jailer Movie విడుదలకు ముందు హిమాలయాలకు చెక్కేసిన రజనీ.. అసలు కారణం ఇదా?
సూపర్ స్టార్ రజనీ కాంత్ ను అభిమానులు తలైవా అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఇక సూపర్ స్టార్ రజినీ కాంత్ తాజా చిత్రం జైలర్ రిలీజ్ అయి సూపర్ హిట్టు టాక్ తో దూసుకుపోతంది. ఇదిలా ఉంటే.. రజినీ కాంత్ మరోసారి హిమాలయాలకు వెళ్లిపోయారు. సినిమా రిలీజ్ కు ముందే హిమాలయాలకు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. ఇక ఈ మూవీకి బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. తమన్నా హీరోయిన్ గా నటించగా.. రజినీ కాంత్ సరసన రమ్య కృష్ణ నటించింది. ఇక ఈ మూవీని సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ తెరకెక్కించారు. ఇక ఆగస్టు 10న ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.

జైలర్ మూవీ ఓ వైపు సూపర్ సక్సెస్ తో దూసుకుపోతుంటే.. సినిమా రిలీజ్ కు ముందే రజినీకాంత్ హిమాలయాలకు వెళ్లిపోయారు. దాదాపు వంద కోట్లకు పైగా జైలర్ మూవీ కోసం రజినీకాంత్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తాయి. అన్ని కోట్లు తీసుకున్న రజినీ కాంత్ తన సినిమాను పట్టించుకోకుండా హిమాలయాలకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

రజినీ కాంత్ హీమాలయాలకు వెళ్లి అక్కడే మూడు రోజులు ధ్యానంలో ఉండనున్నారట. ఇప్పుడు ఈ వార్త కోలివుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. హిమాలయాలకు రజినీ వెళ్లడం మొదటి సారి కాదు.. ఆయన ప్రశాంతమైన జీవితం కోసం ఆయనకు సమయం దొరికినప్పుడల్లా హిమాలయాలకు వెళ్తూంటారు. మామూలుగా ఏ హీరో అయినా.. వెకెషన్ వెళ్లాలి అనుకంటే.. విదేశాల్లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. రజినీ అందుకు భిన్నం.

హిమాలయాలకు వెళ్లి రజినీ కాంత్.. ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఒక మూడు రోజుల పాటు.. అక్కడే ఉండి... దేని గురించి ఆలోచించకుండా, ప్రశాంతమైన జీవితం గడిపి వస్తారు. అలా జైలర్ మూవీ రిలీజ్ కు ముందే రజినీ.. హిమాలయాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు రజనీకాంత్ తన సినిమాల విడుదల సమయంలో హిమాలయాలకు వెళ్తే మాత్రం.. ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మెగా హిట్స్ కావడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడు ప్రవీణ్ గాంధీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

అందుకే ఇప్పుడు రజనీకాంత్ హిమాలయాలకు వెళ్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో 'సూపర్ స్టార్ సినిమాకు ఈసారి పక్కా బ్లాక్ బస్టర్' అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై మంచి టాక్ వినిపిస్తోంది. ఇక బీస్ట్ వైఫల్యంతో ఉన్న నెల్సన్ కు, ఫ్లాపుల్లో రజినీలకు ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలవనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











