పిల్లలు, పెద్దల హృదయాలను గెలుచుకొన్న షిన్ చాన్.. భారీ‌గా బాక్సాఫీస్ సక్సెస్ దిశగా యానిమేటెడ్ మూవీ

ఇటీవల కాలంలో చిన్నవారి నుంచి పెద్దలను, అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎదురు చూసేలా చేసిన యానిమినేటెడ్ చిత్రం షిన్ చాన్: ది స్పైసీ కాసకబే డ్యాన్సర్స్ ఇన్ ఇండియా. సెప్టెంబర్ 26వ తేదీన ఈ చిత్రం భారత్‌లో గ్రాండ్‌గా రిలీజై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతున్నది. మొట్టమొదటిసారిగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజై పిల్లలు, పెద్దల హృదయాలను గెలుచుకొంటూ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబడుతున్నది. ఈ సినిమాను చెన్నై, హైదరాబాద్‌లో బాలలకు ఉచితంగా ఓ స్వచ్చంద సంస్థ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనకు సంబంధించిన విషయాలు, ఈ సినిమా విశేషాల్లోకి వెళితే..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. షిన్ చాన్, కాసకబే గార్డ్ గ్రూపులోని మిస్టీరియస్‌‌ క్యారెక్టర్, లీడ్ స్టార్ బో చాన్ , నేనే, మసావో, కజ్మ మధ్య స్నేహబంధం గురించి చెప్పే ఫీల్ గుడ్ కథ. ఇండియాలో సాహోసోపేతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న షిన్ చాన్, బో చాన్‌కు ఓ అసాధారణమైన జనరల్ స్టోర్ వద్ద అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. ఆ స్టోర్ లోపల వారికి ముక్కు రూపంలో వింతైన బ్యాక్ ప్యాక్ లభిస్తుంది. వింత ఆకారంలో కనిపించిన దానిని షిన్ చాన్ కొనుగోలు చేయాలని నిర్ణయిస్తాడు. ఆ సమయంలో దాని ద్వారా ఎదురయ్యే కనిపించని ప్రమాదాన్ని గుర్తించలేకపోతాడు. బ్యాక్ ప్యాక్‌లో ఉన్న కాగితం ముక్క ముక్కులోకి దూరి బో చాన్ ఉత్సాహంపై నీళ్లు జల్లుతుంది. అతడి అమాయకపు చర్య వల్ల ఓ దుష్టశక్తి అతడిని ఆవహించేస్తుంది. ఆ దుష్ట ప్రభావంతో బ్రో చాన్ ప్రపంచాన్ని బెదిరించే శక్తులు వచ్చిన ఓ భయంకరమైన నియంతగా మారిపోతాడు. ఆ సమస్య నుంచి షిన్ చాన్, అతడి స్నేహితులు ఎలా రక్షించారనేది ఆసక్తికరమైన పాయింట్ ఈ సినిమాగా రూపొందింది.

The Spicy Kasukabe Dancers In India

షిన్ చాన్: ది స్పైసీ కాసకాబే డ్యాన్సర్స్ ఇన్ ఇండియా స్పెషల్ స్క్రీనింగ్‌ టీవీ ఆసాహి నేతృత్వంలో జరిగింది. హైదరాబాద్, చెన్నైలో బాలలకు ఎన్టీవో ప్రదర్శించిన ఈ సినిమా స్క్రీనింగ్‌ ప్రమోషన్స్‌ కార్యక్రమంలో డైలీ హంట్, ఫిల్మీబీట్ భాగమైంది. తమకు ఇష్టమైన షిన్ చాన్, అతడి స్నేహితుల క్యారెక్టర్లను సిల్వర్ స్క్రీన్‌పై చూసి మురిసిపోయారు. తెర మీద వారు చేసిన పెర్ఫార్మెన్స్‌కు పిల్లలంతా కేరింతలు కొడుతూ, నవ్వుల్లో మునిగిపోయి థ్రిల్ అయ్యారు. ఈ సినిమా వారికి గొప్ప అనుభూతిని, మెమొరీని పంచింది.

ఇదిలా ఉండగా, ఈ యానిమేటెడ్ సినిమా రిలీజైన ప్రతీ చోట మంచి స్పందనను చూరగొంటున్నది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండిస్తున్నది. ఐదేళ్ల తర్వాత వచ్చిన ఫ్రాంచైజీ చిత్రం అనూహ్యమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్నది అని ట్రేడ్ రిపోర్టులు, అనలిస్టులు వెల్లడిస్తున్నారు.

Shin chan The Spicy Kasukabe Dancers

టీవీ అసాహి నుంచి మైకో సుమిదా మాట్లాడుతూ.. ఈ సినిమా కథ మొత్తం ఇండియాలో సాగుతుంది. సాధ్యమైనంత మేరకు భారతీయ బాలలకు ఈ సినిమాను చూపించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా పిల్లలకు పూర్తిస్థాయిలో వినోదాన్ని, సంతోషాన్ని కలిగించింది అని తెలిపారు.

ఈ సినిమాను విడుదల చేసిన భాగస్వాములు ఆనురాన్ ముఖర్జీ, హ్యాపెనింగ్ 365 సినర్జీస్ నుంచి కల్పితా జాదవ్ తమ అనుభూతులను పంచుకొంటూ.. పిల్లల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. పిల్లల నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత ఈ మూవీ రిలీజ్ మరింత స్పెషల్‌గా మారింది అని అన్నారు.

Shin chan The Spicy Kasukabe Dancers

తమిళనాడుకు చెందిన సేవాభారతి విషయానికి వస్తే.. స్వామి వివేకానంద ఫిలాసఫీ నుంచి స్పూర్తిని పొంది మానవాళికి సేవలను అందిస్తున్నది. పౌరులను, కమ్యూనిటీ‌లో జీవించే వారిలో చైతన్యం కలిగించేందుకు సేవాభారతి తన సేవలను కొనసాగిస్తున్నది. విద్య, హెల్త్ కేర్, సెల్ఫ్ రిలయెన్స్, సోషల్ వెల్ఫేర్, డిజాస్టర్ రిలీఫ్, పిల్లల విద్యపరంగా వృద్ధి, పర్యావరణ సంబంధింత విషయాల్లో అవగాహన కల్పించే సేవలను కొనసాగిస్తున్నారు.

నలందా వే ఫౌండేషన్ (చెన్నై, హైదరాబాద్) గురించి.. పిల్లల పోషణకు సంబంధించి అత్యంత అవసరమైన సంరక్షణ, ఇతర అంశాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఫుడ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ విషయంలోను, లైఫ్ సిల్క్, గృహ వాతావరణానికి సంబంధించిన ప్రేమ, అనుబంధాలు పెంచి, విశ్వాసం కలిగించే కార్యక్రమాలను చేపడుతున్నది.

స్పూర్తి ఫౌండేషన్ (హైదరాబాద్): పిల్లలకు గృహ సంబంధిత విషయాల్లోను అలాగే అవసరమైన పోషణాత్మక సమగ్ర సంరక్షణను అందిస్తుంది. ఫుడ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లాంటి పిల్లలకు కావాల్సిన బేసిక్ అవసరాలు, స్కిల్స్, ఎమోషనల్ సపోర్ట్, ఫ్యామిలీ విషయాల్లో ప్రేమను పెంచేలా.. పిల్లల్లో విశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపడుతుంది.

Shin chan The Spicy Kasukabe Dancers

తుది తీర్పు:

షిన్ చాన్: ది స్పైసీ కాసకబే డ్యాన్సర్స్ ఇన్ ఇండియా సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చేయడం ద్వారా లభించిన స్పందనతో ఇండియాలో ఈ సినిమా రిలీజ్ అర్ధవంతంగా మారింది. పిల్లలు, NGO భాగస్వాములకు ఈ మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాయి. షిన్ చాన్ ప్రయాణంలో భాగం చేసి చక్కటి అనుభూతిని మిగిల్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శింపబడటం యూత్ ఆడియెన్స్‌లో సంతోషాన్ని తీసుకొచ్చింది. షిన్ చాన్: ది స్పైసీ కాసుకాబే డ్యాన్సర్స్ ఇన్ ఇండియా కేవలం ఓ సినిమా మాత్రమే కాకుండా గొప్ప అనుభూతిని పంచేలా చేస్తూ.. అన్ని వర్గాలను భాగం చేస్తూ వినోదం, ఫన్ పంచుతూ అందర్నీ ఐక్యం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X