యువ హీరో కోసం విజయ్ దేవరకొండ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా రౌడీ స్టార్
తెలుగు సినిమా పరిశ్రమలో కంటెంట్‌ను నమ్ముకొని వచ్చే చిన్న సినిమాలు ప్రేక్షకుల ఆదరణను అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లు సాధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి కోవకు చెందిన కీడా కోలా సినిమా టాలీవుడ్‌లో సందడి చేస్తున్నది. ఈ సినిమా రిలీజ్‌కు మంచి బజ్ క్రియేట్ చేయడంతో బిజినెస్ కూడా క్రేజీగా జరుగుతున్నట్టు వార్తలు అందుతున్నాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో జోష్ పెంచుకొన్న చిత్ర యూనిట్ ప్రోమోషన్స్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతున్నది. ఇక ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ సినిమాలను అందించిన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన కీడా కోలా నవంబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కీడా కోలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

యువ హీరో చైతన్య రావు నటించిన కీడా కోలా సినిమాకు సంబంధించి ఆదివారం (అక్టోబర్ 28వ తేదీ)న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని చిత్ర యూనిట్ ఆహ్వానించగా విజయ్ దేవరకొండ తన సంసిద్దతను వ్యక్తం చేశారు. దాంతో ఈ సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
ఇక కీడా కోలా సినిమా వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రంలో బ్రహ్మానందం ఓ కీలక పాత్రలో వరధరాజులు తాతగా, చైతన్య రావు వాస్తుగా, రాగ్ మయూర్ లంచం, నాయుడిగా తరుణ్ భాస్కర్, సికందర్‌గా టాక్సీవాలా విష్ణు, జీవన్‌గా జీవన్, సీఈవో పాత్రలో రవీంద్ర విజయ్, షాట్స్‌గా రఘురాం నటిస్తున్నారు.
రానా దగ్గుబాటి సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కీడా కోలా సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా ఏజే ఆరోన్, మ్యూజిక్ డైరెక్టర్‌గా వివేక్ సాగర్, ఎడిటర్‌గా ఉపేంద్ర వర్మ, ఆర్ట్ డైరెక్టర్‌గా ఆశీష్ తేజ పుజాలా వ్యవహరిస్తున్నారు. తరుణ్ భాస్కర్ అందించిన కథను అందించగా.. ఈ సినిరమాను వివేక్ సుధాన్షు, సాయికృష్ణ గద్వాల, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు.


Click it and Unblock the Notifications











