రాజమౌళి శిష్యుడి మొదటి సినిమా.. ఆసక్తిని కలిగిస్తున్న ఆకాశవాణి టీజర్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ సినిమా టెక్నీషియన్స్ కలిగిన రాజమౌళి ఫ్యామిలీలో కొంతమంది ఇంకా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కావడం లేదు. ప్రయోగాలు బాగానే చేస్తున్నారు పూర్తి స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ అందుకోవడం లేదు. ఇక కీరవాణి తనయులు ఇప్పుడిప్పుడే వారి టాలెంట్ ను బయటపెడుతున్నారు. అందులో కాల బైరావ మ్యూజిక్ డైరెక్టర్ గా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.
ఇక రాజమౌళి నుంచి చాలా రోజుల తరువాత ఒక శిష్యుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈగ, బాహుబలి సినిమాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అశ్విన్ గంగరాజు తెరకెక్కించిన మొదటి సినిమా ఆకాశవాణి. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు.

ద వరల్డ్ ఆఫ్ ఆకాశవాణి పేరుతో విడుదలైన ఈ టీజర్ ను రాజమౌళి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. సినిమాను పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాల బైరావ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. చూస్తుంటే సరికొత్తగా ఎదో ప్రయోగం చేసినట్లు ఉన్నారని అనిపిస్తోంది. ఇక సినిమాలో కోలీవుడ్ దర్శకుడు, నటుడు సముద్రఖని కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. మరి ఈ సినిమాతో చిత్ర యూనిట్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











