twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థియేటర్స్‌లో పార్కింగ్ చార్జీలు బాదుడు.. ప్రభుత్వంతో ఫిలిం ఛాంబర్ పెద్దల చర్చలు

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మార్కెట్ పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ థియేటర్స్ బిజినెస్ చాలా వరకు నష్టాల్లోనే ఉన్నట్లు కొంతమంది ఓనర్స్ వాబోతున్నారు. కొంతమంది నిర్మాతలు సొంతంగా థియేటర్స్ నడిపించలేక అమ్మేసుకున్నారు కూడా. మరికొందరు లీజుకు తీసుకొని నడిపిస్తున్నారు. ఇక ఇటీవల మరోసారి పార్కింగ్ చార్జీలను అమల్లోకి తేవాలని టాలీవుడ్ నిర్మాతలు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరువుతోంది.

    కరోనా దెబ్బకు

    కరోనా దెబ్బకు

    కరోనా దెబ్బకు థియేటర్స్ మార్కెట్ చాలా వరకు దెబ్బతింది. కొన్ని సినిమా థియేటర్లు అయితే షాపింగ్ మాల్స్ గా మారిపోగా మరికొన్ని ఇతర బిజినెస్ లోకి షిఫ్ట్ అయ్యాయి. ఓటీటీ బిజినెస్ కూడా థియేటర్స్ పై ప్రభావం గట్టిగానే చూపించింది. కొన్ని సినిమాలు బాగానే హిట్టవుతున్నా కూడా ఎక్కువ కాలం థియేటర్స్ లో నిలవలేకపోతున్నాయి.

    థియేటర్స్ వద్ద పార్కింగ్ చార్జీలపై చర్చ

    థియేటర్స్ వద్ద పార్కింగ్ చార్జీలపై చర్చ

    కేవలం పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే థియేటర్స్ నిలదొక్కుకుంటున్నాయి. అది కూడా హిట్టయితేనే వారం మాత్రమే సందడి కనిపిస్తోంది. అయితే 2018లో తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్ వద్ద పార్కింగ్ చార్జీలు తీసుకోవద్దని కొత్త రూల్ తీసుకురాగా థియేటర్స్ ఆదాయం అక్కడే 40% పడిపోయినట్లు తెలుస్తోంది.

    థియేటర్స్ ఎందుకు ఓపెన్ చేయలేదు..?

    థియేటర్స్ ఎందుకు ఓపెన్ చేయలేదు..?

    ఇటీవల తెలంగాణ చీఫ్ సెక్రటరీ అలాగే నిర్మాతలు దిల్ రాజు, దామోదర ప్రసాద్, దగ్గుబాటి సురేష్ ఇండస్ట్రీ థియేటర్స్ సమస్యలపై సమావేశం జరిపారు. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ థియేటర్స్ ఎందుకు ఓపెన్ చేయలేదని సీఎస్ ప్రశ్నించగా... ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో థియేటర్స్ ప్రారంభిస్తే తప్ప సినిమాల విడుదల సాధ్యంకాదని నిర్మాతలు వివరణ ఇచ్చారు.

    పార్కింగ్ నుండే దాదాపు 40% రాబడి

    పార్కింగ్ నుండే దాదాపు 40% రాబడి

    ఇక 2018లో తెలంగాణ ప్రభుత్వం ఉచిత పార్కింగ్ నిర్ణయం తీసుకోవడంతో థియేటర్స్ బిజినెస్ పై ప్రభావం పడిందని మళ్ళీ పార్కింగ్ చార్జీలకు అనుమతి ఇస్తే ఆర్థిక ఇబ్బందులకు వెసులుబాటు ఉంటుందని సినిమా ప్రొడ్యూసర్స్ వివరణ ఇచ్చారు. థియేటర్ల లో పార్కింగ్ నుండే దాదాపు 40% రాబడి ఉంటుందని థియేటర్స్ యాజమాన్యం కూడా విన్నవించుకుంది.

    Recommended Video

    Swapnika Exclusive Interview Part 4 | Sarkaru Vaari Paata AD ​| Filmibeat Telugu
    సానుకూలంగా స్పందించిన్న సీఎస్

    సానుకూలంగా స్పందించిన్న సీఎస్

    ఇక ఈ విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సీఎస్ సోమేశ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఇక మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 8నుంచి 50% ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని అనుమతులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఆ విషయంపై కూడా సినీ పెద్దలు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

    English summary
    While it is true that the Tollywood film industry market has grown, some owners are saying that the theater business is largely at a loss. Some producers even sold their own theaters to run. Others are leased and run. Recently, Tollywood producers are in talks with the Telangana government to reintroduce parking charges.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X