twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీలో ప్రభాస్ ఫాన్స్ కి షాక్.. "రాధేశ్యామ్" థియేటర్లు సీజ్.. ఏమైందంటే?

    |

    ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్‌ తో థియేటర్లలోకి అడుగుపెట్టాడు. బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ లవ్ స్టొరీ ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 11న రిలీజ్ అయింది. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం విడుదల అయితే అయింది కానీ పలు థియేటర్లను సీజ్ చేసినట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

    ప్రేక్షకుల ముందుకు

    ప్రేక్షకుల ముందుకు

    సాహో తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన తాజా చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, మురళి శర్మ, ప్రియదర్శి లాంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యు.వి.క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ ల మీద ఈ సినిమాను వంశీ, ప్రమోద్, ప్రసీద కలిసి సంయుక్తంగా నిర్మించారు.. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొనగా అనేక వాయిదాల అనంతరం మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

     బెనిఫిట్ షోలకు అనుమతి

    బెనిఫిట్ షోలకు అనుమతి

    మూడేళ్ళ తర్వాత డార్లింగ్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. లవర్ బాయ్ లుక్ లో ఉన్న ప్రభాస్ కట్ ఔట్స్ తో థియేటర్లు మొత్తం నిండి పోయాయి, పాలాభిషేకాలు, తీన్మార్ డప్పులు, బాణసంచా కాల్పులతో చాలా డార్లింగ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. తెలంగాణలో చాలా చోట్ల బెనిఫిట్ షోలు వేయగా, ఆంధ్రాలో మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి లభించలేదు.

     థియేటర్లకు తాళాలు

    థియేటర్లకు తాళాలు


    కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం ‘రాధే శ్యామ్', ‘ఆర్ఆర్ఆర్' సినిమాలకు టికెట్ ధరలు 10 రోజుల పాటు పెంచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం 25 రూపాయలు పెంచుకోవచ్చని పెర్కజొన్నారు. కానీ ఎలాంటి బెనిఫిట్ షోలు లేకుండా "రాధేశ్యామ్" ఆంధ్రాలో విడుదలైంది. ఏపీలో అధికారుల ఆదేశాలను ధిక్కరించి బెనిఫిట్ షోలు వేస్తున్న థియేటర్లకు తాళాలు పడుతున్నాయి.

     సీజ్‌ చేశారు

    సీజ్‌ చేశారు


    తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాంలో "రాధేశ్యామ్" బెనిఫిట్ షో వేయడానికి ప్రయత్నించిన ఎస్వీసీ థియేటర్ ను అధికారులు సీజ్ చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు థియేటర్ కు తాళాలు వేయడంతో ఈరోజు సినిమా ప్రదర్శించడం లేదు అని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. అలాగే మరో పక్క అదే రాజాంలో రాధేశ్యామ్ ప్రదర్శితమవుతోన్న అప్సర థియేటర్‌ను అధికారులు సీజ్‌ చేశారు. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్‌ షో ప్రదర్శించారని తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

    Recommended Video

    Radhe Shyam Review ప్రభాస్ ఫాన్స్ జెన్యూన్ రివ్యూ .. | Prabhas | Pooja Hegde| Filmibeat Telugu
    ఈలలు, కేకలు వేస్తూ

    ఈలలు, కేకలు వేస్తూ


    దీంతో ప్రభాస్‌ అభిమానులు నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే మరో పక్క తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మహిళా ప్రేక్షకుల కోసం రాధేశ్యామ్ స్పెషల్ షో ప్రదర్శించారు. వీపీసీ థియేటర్లలో ఒక స్క్రీన్ ను కేవలం మహిళలకే కేటాయించి షో వేశారు. ఈ సందర్భంగా మహిళలు ఈలలు, కేకలు వేస్తూ ప్రభాస్ మీద ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు.

    English summary
    Theaters seized in Srikakulam Rajam because of Radhe Shyam benefit show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X