విశ్వక్‌సేన్ ఇంట్లో దొంగల బీభత్సం.. ఎన్ని లక్షలు దోచుకెళ్లారంటే?
ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నూమా దాస్, హిట్ , పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం తదితర చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోలలో ఒకరిగా నిలిచారు మాస్ కా దాస్ విశ్వక్‌సేన్. చిన్నా చితకా సినిమాలతో కెరీర్ ప్రారంభించిన విశ్వక్ .. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలవరీకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా తక్కువ సమయంలోనే ఈ స్థాయి క్రేజ్ తెచ్చుకున్నారు విశ్వక్‌సేన్.
హిట్టు ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తోన్న విశ్వక్‌సేన్ గత నెల 14న వాలంటైన్స్ డే కానుకగా లైలా అంటూ పలకరించారు. అయితే ఈ చిత్రం విశ్వక్ సేన్ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచింది. తన నట జీవితంలోనే తొలిసారిగా డ్యూయెల్ రోల్ పోషించడంతో పాటు అందులో ఒకటి లేడీ గెటప్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ కావడంతో మంచి బజ్ అందుకుంది.

అయితే ఇదే వేదికపై థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఇవి తమ నాయకుడు వైఎస్ జగన్‌ను ఉద్దేశించినవేనంటూ వైసీపీ శ్రేణులు భగ్గుమనడంతో పాటు ఈ సినిమాను ఫ్లాప్ చేస్తామంటూ బాయ్ కాట్ లైలా పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్‌కు దిగారు. వెంటనే అలర్ట్ అయిన హీరో విశ్వక్‌సేన్, నిర్మాత సాహూ గారపాటిలు మీడియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పారు. తర్వాత కొద్దిరోజులకే పృథ్వీరాజ్ కూడా క్షమాపణలు చెప్పడంతో వివాదానికి తెరపడింది.
కానీ అసభ్యపదజాలం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ శృతి మించడంతో లైలాపై ఎఫెక్ట్ పడి బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీనిపై స్పందించిన విశ్వక్‌సేన్ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. తన సినిమాలు ఇటీవల అంచనాలను అందుకోవడం లేదని అలాగే వల్గారిటీ కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తన సినిమాల్లో అసభ్యతకు తావు లేకుండా చూసుకుంటానని , అందరికీ నచ్చే విధంగానే తన చిత్రాలు ఉంటాయని బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం విశ్వక్‌సేన్ ఫంకీ, వీఎస్ 13 సినిమాలలో నటిస్తున్నారు.
ఇదిలాఉండగా.. హైదరాబాద్‌లోని విశ్వక్‌సేన్ ఇంట్లో ఆదివారం భారీ చోరీ జరిగింది. ఫిలింనగర్ రోడ్ నెం.8లోని విశ్వక్‌సేన్ నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదే బిల్డింగ్‌లోని మూడో అంతస్తులో విశ్వక్ సోదరి వన్మయి ఉంటున్నారు. తెల్లవారుజామున తన ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో భయాందోళనకు గురైన వన్మయి వెంటనే ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు విశ్వక్‌సేన్ ఇంటికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. తెల్లవారుజామున 5.50 గంటల సమయంలో అగంతకుడు వెనుక ద్వారం గుండా మూడో అంతస్తులోని వన్మయి బెడ్ రూంలోకి చొరబడి డబ్బు, బంగారు ఆభరణాలను దొంగిలించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో రెండు వజ్రపు ఉంగరాలు సహా రూ.2.20 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైనట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇంత పక్కగా దొంగతనం చేయడంతో విశ్వక్‌సేన్ కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తి పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు నివసించే హై సెక్యూరిటీ ఏరియాలో దొంగతనం జరగడం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











