Year Ender 2023: తొలి చిత్రంతోనే ఫ్లాప్ సొంతం చేసుకున్న కొత్త హీరోయిన్లు వీళ్లే.. ఓ లుక్కయేండి
మరో 12 రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పేసి కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పబోతున్నాం. అయితే 2023వ సంవత్సరంలో చాలా మంది కొత్త కొత్త సినిమాలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ముఖ్యంగా ఎవరూ ఊహించని స్థాయిలో హిట్లు కొట్టారు.
మరికొందరు అయితే తమ మొదటి సినిమాలతోనే ఫ్లాప్ లను సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఏడాదే ఇండస్ట్రీలో అడుగు పెట్టి మొదటి సినిమాతో డిజాస్టర్లు సొంతం చేసుకున్న హీరోయిన్ల లిస్టు ఇక్కడ ఉంది. అయితే వారెవరూ.. ఏ సినిమాలు వాళ్లకు ఈ ఏడాది చేదును మిగిల్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. గాయత్రీ భరద్వాజ్: మాస్ మహారాజా హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. కానీ మొదటి సినిమాతో డిజాస్టర్ సొంతం చేసుకుని తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.
2. సాక్షి వైద్య: అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గాంధీవధారి అర్జునతో కూడా ఫ్లాప్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకుంది.
3. నుపుర్ సనన్: మాస్ మాహారాజ రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఫ్లాప్ అవ్వడంతో.. కన్నప్పలో ఛాన్స్ వచ్చిన కాదనుకుని వెళ్లిపోయింది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ కృతి సనన్ చెల్లెలు కావడం గమనార్హం.
4. గీతికా తివారి: అహింస సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. దగ్గుబాటి అభిరామ్ సరసన నటించ తీవ్రమైన డిజాస్టర్ ను సొంతం చేసుకుంది.
5. యుక్తి తరేజా: రంగబలి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన యుక్తి తరేజా.. నాగ శౌర్య పక్కన నటించి మంచి మార్కులే కొట్టేసింది. కానీ ఈ సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.
6. ఐశ్వర్యా మీనన్: నిఖిల్ సిద్ధార్థ హీరోగా వచ్చిన స్పై చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి.. తొలి చిత్రంతోనే ఫ్లాప్ ను అందుకుంది క్యూట్ బ్యూటీ ఐశ్వర్యా మీనన్.
7. ప్రియా భవానీ శంకర్: కల్యాణం కమనీసం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి.. మొదటి సినిమాతోనే డిజాస్టర్ ను సొంతం చేసుకుంది ప్రియా భవానీ శంకర్.


Click it and Unblock the Notifications











