Sankranti 2024: మూడు రోజుల్లోనే 8 అతిపెద్ద సినిమాలు.. సంక్రాంతికి ప్రేక్షకులకు పండగే!
పండుగలు వస్తున్నాయంటే చాలు అనేక సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుంటాయి. అయితే శుక్రవారం లేదా పండుగల అప్పుడు సినిమాలు రిలీజ్ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అప్పుడే విడుదల కూడా చేస్తుంటారు. అయితే నూతన సంవత్సంర సందర్భంగా వచ్చే సినిమాల కంటే కూడా ఈసారి సంక్రాంతి పండుగకు వచ్చే సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం మూడు రోజుల్లోనే మొత్తం ఎనిమిది పెద్ద చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇందులో ఏయే సినిమాలు ఆడుతాయో, ఎంత మేర ఆకట్టుకుంటాయో తెలియదు కానీ అంతా ఒకేసారి పోటీగా వచ్చేస్తున్నారు. అయితే ఈ సినిమాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. గుంటూరు కారం
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం రాబోతుంది. జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తుండగా.. నాగవంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

2. హనుమాన్
తేజ సజ్జ హీరోగా రాబోతున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా... ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో విడుదల కాబోతుంది.

3. కెప్టెన్ మిల్లర్
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రాబోతున్న ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్ పై నిర్మించారు. ధనుష్ సరసన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ నటస్తుండగా.. అరుణ్ కుమార్, సందీప్ కిషన్, జాన్ కొక్కెన్, ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
4. అయలాన్
శివకార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అయలాన్ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది. ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేజేఆర్ స్టూడియోస్ పై కోటపాడి జె రాజేష్ నిర్మించారు.
5. మేరీ క్రిస్మస్
కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి హీరోహీరోయిన్లుగా నటించబోతున్న మేరీ క్రిస్మస్ సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతుంది. టిప్స్ ఫిలిమ్స్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై రమేష్ తురాని, జయా తురాని సంజయ్ రోటరీ, గేవాల్ గార్గ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధిక ఆప్టే, టీను ఆనంద్, అశ్విన్ కలెష్కర్, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా హిందీ తో పాటు తమిళంలోనూ రిలీజ్ కాబోతోంది.
6. సైంధవ్
విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రాబోతున్న సినిమా సైంధవ్ ను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మింస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా 2024 జనవరి 13న విడుదల చేస్తున్నారు.

7. ఈగల్
మాస్ మహారాజ రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రాబోతున్న సినిమానే ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా డనవరి 13వ తేదీన విడుదల కాబోతుంది.
8. నా సామి రంగ
నాగార్జున హీరోగా ఆశికా రంగనాథ్ హీరోయినా గా విజయ్ బిన్ని దర్శకత్వంలో రాబోతున్న సినిమానే నా సామి రంగ. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ముందుగా జనవరి 24వ తేదీన రిలీజ్ చేయాలని భావించినప్పటికీ.. జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











