Republic Day 2024: రిపబ్లిక్ డేకి థియేటర్లలో పండగే.. రెండు రోజుల్లో ఐదు సినిమాలు, అవేంటో తెలుసా?
పండుగలు వస్తున్నాయంటే చాలు అనేక సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుంటాయి. అయితే శుక్రవారం లేదా పండుగల అప్పుడు సినిమాలు రిలీజ్ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అప్పుడే అనేక చిత్రాలను కూడా విడుదలచేస్తుంటారు. ఎంత పోటీ ఉన్నా పట్టించుకోకుండా వచ్చేస్తుంటారు.
ఇటీవలే సంక్రాంతి పండుగ సందర్భంగా అద్భుతమైన సినిమాలు విడుదల కాగా.. మరోసారి గణతంత్ర దినోత్సం సందర్భంగా మరిన్ని అద్భుతమైన చిత్రాలు రాబోతున్నాయి. ముఖ్యంగా 5 పెద్ద సినిమాలు వస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే మొత్తం ఐదు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఆ సినిమాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. కెప్టెన్ మిల్లర్: ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల అయింది. కానీ తెలుగులో పోటీ ఎక్కువగా ఉండడంతో.. ఇక్కడ వాయిదా వేశారు. అయితే జనవరి 25వ తేదీన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

2. అయలాన్: శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. కానీ తెలుగులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరక్కపోయేసరికి ఇక్కడ వాయిదా వేశారు. అయితే జనవరి 25వ తేదీన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

3. మలైకోటి వాలియన్: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తాజాగా నటించిన చిత్రం మలైకోటి వాలియన్. లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25వ తేదీన విడుదల చేయబోతున్నారు.

4. 105 మినిట్స్: హన్సిక ప్రధాన పాత్రలో రాబోతున్న తాజా సినిమా 105 మినిట్ట్. రాజు దుస్సా తెరకెక్కించిన ఈ సినిమాను కూడా రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. జనవరి 26వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

5. ఫైటర్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా, హాట్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా రాబోతున్న తాజా చిత్రం ఫైటర్. సిదార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నారు. జనవరి 25వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











