Oscars 2025: మరోసారి ఆస్కార్ బరిలో టాలీవుడ్ .. తెలుగు నుంచి ఏయే సినిమాలంటే ?
ప్రపంచవ్యాప్తంగా సినీ నటులు తాము జీవితంలో ఒక్కసారైనా పొందాలనుకునే అవార్డ్ ఆస్కార్. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఈ అవార్డ్ అందరి కల. గతేడాది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్‌ను సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ ఏడాది కూడా ఆస్కార్ ఎంట్రీలు ఓపెన్ కాగా మన తెలుగు సినిమా మరోసారి సత్తా చాటుతుందా అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు . ఈ వివరాల్లోకి వెళితే..
97వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. మార్చి 2, 2025న జరగనున్న ఈ మెగా ఈవెంట్‌కి సంబంధించి ఆయా దేశాల నుంచి ఎంట్రీలు వెళ్లనున్నాయి. దీనికి సంబంధించిన విధి విధానాలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇప్పటికే విడుదల చేసింది. చాలా దేశాలు తమ సినిమాలను ఆస్కార్ ఎంట్రీకి పంపించాయి. భారత్ నుంచి కూడా సినిమాలను పంపేందుకు కసరత్తు మొదలైంది.

ఆస్కార్ ఎంట్రీలకు సంబంధించి కేంద్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్క్రీనింగ్ పెట్టి ఆయా భాషాలకు చెందిన సినిమాలను ఎంపిక చేస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలకు చెందిన పలు చిత్రాలు ఆస్కార్ కోసం పోటీపడుతున్నాయి. దీనికి సంబంధించి నేడో రేపో కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారాన్ని బట్టి తమిళ్ నుంచి తంగలాన్, వాజై, కొట్టుకాళి, మహారాజ, జమా, జిగర్తాండ డబల్ ఎక్స్ ఆస్కార్ బరిలో నిలిచాయి. మలయాళం నుంచి ఊళ్ళోజుక్కు, ఆడు జీవితం, ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్, ఆట్టం పోటీ పడుతున్నాయి. మరాఠీ నుంచి స్వరగంధర్వ సుధీర్ ఫడకే, ఘాట్, ఘరత్ గణపతి ఉన్నాయి. హిందీ నుంచి కిల్, ఆర్టికల్ 370, షామ్ బహదూర్, గుడ్ లక్, జోరం, ఆనిమల్, శ్రీకాంత్, వీర్ సవార్కర్, చోటా భృమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యం, లా పట్టా లేడిస్, చందు చాంఫియన్‌లు ఆస్కార్ బరిలో నిలిచాయి.

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసిస్తున్న తెలుగు సినిమా నుంచి ఏయే సినిమాలకు ఆస్కార్ ఎంట్రీకి వెళ్లనున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆర్ఆర్ఆర్‌తో ఎస్ఎస్ రాజమౌళి అసాధ్యమనుకున్న ఆస్కార్‌ని సాధించి చూపించారు. కాస్త కష్టపడితే అకాడమీ అవార్డ్ సాధించడం పెద్ద కష్టం కాదని ఆయన ప్రూవ్ చేశారు.

మరి 97వ ఆస్కార్ అవార్డ్స్‌కి ఏయే తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయో చూస్తే. నాగ్ అశ్విన్ - ప్రభాస్‌ల కల్కి 2898 ఏడీ, ప్రశాంత్ వర్మ హనుమాన్, అజయ్ భూపతి మంగళవారం సినిమాలు బరిలో నిలిచాయని ఫిలింనగర్ టాక్. మరి వీటిలో ఏ సినిమాలను కేంద్రం సెలెక్ట్ చేస్తుంది.. ఈసారి కూడా భారతదేశానికి ఆస్కార్ అవార్డ్ వరిస్తుందా అంటూ జనం చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











