Mahesh - Namrata : మహేశ్‌తో నమ్రత పెళ్లికి నో .. కృష్ణనే వణికించిందిగా, ఆమె దెబ్బకు సీక్రెట్‌గా
సూపర్‌స్టార్ కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క పాన్ ఇండియా సినిమాలోనూ నటించుకున్నా.. నేషనల్ , ఇంటర్నేషనల్ రేంజ్ పాపులారిటీని సంపాదించడం మహేశ్‌కే సాధ్యమైంది. ప్రిన్స్‌గా, సూపర్‌స్టార్‌గా, అమ్మాయిల కలల రాకుమారుడిగా తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న మహేశ్ బాబు తన సహ నటి నమ్రతా శిరోద్కర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఓ మహిళ మాత్రం ఈ పెళ్లికి బాగా అడ్డు తగిలారట. ఈ వివరాల్లోకి వెళితే :
బాలనటుడిగా 1979లో వచ్చిన నీడ సినిమాలో కనిపించిన మహేశ్ బాబు.. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా తండ్రి కృష్ణతో కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, చదువుపై కాన్సన్‌ట్రేషన్ చేసిన ప్రిన్స్.. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన రాజకుమారుడు ద్వారా పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలినాళ్లలో లవర్‌బాయ్ రోల్స్ చేసిన మహేశ్ కెరీర్‌ను ఒక్కడు మలుపు తిప్పింది. ఆ వెంటనే అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేనులతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు సూపర్‌స్టార్.

సినిమాలే కాదు.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ప్రకటనల ద్వారా రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు మహేశ్ బాబు. సంపాదించిన డబ్బును పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి బిజినెస్‌మెన్‌గానూ హిట్ కొట్టారు మహేశ్. సంపాదించడమే కాదు, దానదర్మాల విషయంలోనూ ముందుంటున్నారు. తన తండ్రి పుట్టిన ఊరైన ఏపీలోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న వేల మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయించి నిజమైన శ్రీమంతుడిగా నిలిచారు మహేశ్. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నారు సూపర్‌స్టార్ .
అయితే మహేశ్ కెరీర్‌లో ఆయన పెళ్లి.. సినిమాను మించిన ట్విస్టులు నెలకొన్నాయి. వంశీ సినిమాలో తనతో హీరోయిన్‌గా నటించిన నమ్రతా శిరోద్కర్‌ను ప్రిన్స్ ఇష్టపడ్డారు. ఇద్దరూ కొన్నాళ్లు డేటింగ్ చేశాక పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయాన్ని కృష్ణగారికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న వేళ.. తన అక్క మంజుల ద్వారా తండ్రికి రాయబారం నడిపాడు. ఏ విషయంలోనైనా చాలా ఓపెన్‌గా ఉండే కృష్ణ పెళ్లిపై సుముఖంగానే ఉన్నా ఓ పెద్దావిడ మాత్రం ఇందుకు అడ్డుపడ్డారట.

ఆవిడ ఎవరో కాదు.. మహేశ్ అమ్మమ్మ. ఆమెకు క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువట. దీంతో పెళ్లి సెట్ అయ్యాక ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని అడిగేవారట. దీంతో మీడియాకు ఎలాంటి సమాచారం లేకుండా ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ముంబైలో సీక్రెట్‌గా పెళ్లి చేశారట. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్ కృష్ణ బయటపెట్టారు. నమ్రత చాలా తెలివైన అమ్మాయి అని.. ఫైనాన్షియల్ వ్యవహారాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ట్యాక్స్ గొడవలు అన్నింటిని నమ్రత చూసుకోవడంతో మహేశ్‌కు స్ట్రెస్ తగ్గిందని కృష్ణ తన కోడలి గురించి గొప్పగా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











