Latest Hit Movies: తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినా.. కోట్లు కొల్లగొట్టిన తాజా చిత్రాలివే!

స్టార్ హీరోల సినిమాలు, పెద్ద పెద్ద బడ్జెట్ చిత్రాలు మాత్రమే బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తాయనే అపోహ చాలా మందిలో ఉండేది. ముఖ్యంగా గతంలో స్టార్ హీరోలు సినిమాల్లో కనిపిస్తే.. కచ్చితంగా హిట్టు అవుతాయని అంతా అనుకుంటుండేవారు. కానీ అదంతా అపోహే అని చాలా సార్లు రుజువు అయింది. కంటెంట్, కథ బాగుంటే చిన్న సినిమాలు అయినా సరే సూపర్ సక్సెస్ ను సాధిస్తాయి. ఇందుకు చాలా ఉదారహరణే ఉన్నాయి. అయితే తాజాగా వచ్చిన కొన్ని తక్కువ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీగానే కలెక్షన్లు సాధిస్తున్నాయి. అయితే ఆ చిత్రాలు ఏవి, ఏ మేర కలెక్షన్లు రాబడుతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్ తో ఎక్కువగా కొత్త హీరోలతో ప్రయోగాలు చేసే ఈయన రెండు సినిమాలతోనూ సక్సెక్ సాధించారు. అయితే చాలా గ్యాప్ తర్వాత ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం కీడాకోలా. కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం నవంబర్ 3వ తేదీన విడుదల అయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని అందరినీ ఫుల్లుగా అలరిస్తోంది.

These Small Budget Films Going to Big Wins at Box Office Check Details

చైతన్య హీరో వచ్చిన కీడాకోలా చిత్రాన్ని కేవలం 15 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండు రోజుల్లో 9.72 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి అద్భుతమైన హిట్టు దిశగా దూసుకెళ్తోంది. వీకెండ్స్ కావడంతో ఈ రోజు మరింత కలెక్షన్లు ఎక్కువయ్యే అవకాశం ఉంది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.

అలాగే క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన పొలిమేర 2 గురించి కూడా అందరికీ తెలిసిందే. ఓటీటీలో విడుదలై హిట్టు కొట్టిన పొలిమేర సినిమాకు సీక్వెల్ గా పొలిమేర 2 ను తెరకెక్కించారు. సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాను అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని.. శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరీ కృష్ణ నిర్మించారు.

These Small Budget Films Going to Big Wins at Box Office Check Details

కేవలం 6 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అద్భుతమైన బడ్జెట్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తం రూ.6.93 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే రూ.12.92 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ.7.79 కోట్ల షేర్, 15.20 గ్రాస్ వసూళ్లను సాధించింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన పైరెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టుకుంటూ దూసుకెళ్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X