2023 ఇయర్‌లో టాలీవుడ్‌ను ఏలిన హీరోయిన్లు వీళ్లే.. అందులో మీ ఫేవరెట్ హీరోయిన్ ఉందా?
మరో పది రోజుల్లో 2023 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2024 సంవత్సరానికి వెల్ కమ్ చెప్పబోతున్నాం. ఈక్రమంలోనే ఈ ఏడాది వచ్చిన అద్భుతమైన చిత్రాలు, హిట్టు కొట్టిన చిత్రాలు... ఇలా ఎవరెవరు ఏం సాధించారు, ఎవరెవరు ఏం సాధించకుండా పోయారు అనే అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. అయితే 2023లో టాలీవుడ్ బాక్సాఫీస్ ను ఏలిన టాప్ 5 హీరోయిన్లు ఎవరు, ఏయే చిత్రాలతో వచ్చి ఎక్కువ వసూళ్లు సాధించారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. శ్రీలీలీ:టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల గురించి తెలుగు సినీ ప్రేక్షకుకలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతైమన నటనతో ఆహా అనిపించిన ఈమె ఈ ఏడాది అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాల్లోనూ నటించి బాక్సాఫీసు వద్ద టాప్ హీరోయిన్ గా నిలిచింది. కేవలం ఇవి మాత్రమే కాకుండా గుంటూరు కారం, విజయ్ దేవరకొండ 12వ సినిమాలో, ఉస్తాద్ భగత్ సింగ్, అనగనగా ఒఖ రాజు సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది.

2. కీర్తి సురేష్:
కీర్తి సురేష్ ఈ ఏడాది అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా విలక్షణమైన డీ గ్లామరస్ పాత్రలో నటించి మెప్పించింది. అలాగే భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటించి అందరి చేత కన్నీరు పెట్టించింది. అలాగే సైరన్, రఘుతాత, రివాల్వర్ రాణి వంటి చిత్రాలతోనూ ఆకట్టుకోవడానికి రెడీగా ఉంది.

3. రష్మిక మందన్నా:
వారసుడు, మిషన్ మజ్ను వంటి చిత్రాలతో అద్బుతమైన హిట్లను సొంతం చేసుకున్న నేషనల్ క్రష్ రష్మికా మందన్నా... యానిమల్ చిత్రంతో విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది. ఎవరూ ఊహించని స్థాయిలో మార్కులు కొట్టేసింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. కేవలం ఈ సినిమాలు మాత్రమే కాకుండా మరో పాన్ ఇండియా సినిమా పుష్ప 2: ది రూల్ లో కనిపించబోతుంది. ఇదొక్కటే కాకుండా గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో వంటి సినిమాలు కూడా చేస్తోంది.
4. సంయుక్తా హెగ్డే:
సంయుక్తా హెగ్డే గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఈ ముద్దుగుమ్మ విరూపాక్ష సినిమాతో వచ్చి ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టింది. బాక్సాఫీసు వద్ద భారీ హిట్టు కొట్టింది. అలాగే కల్యాణ్ రామ్ తో కలిసి డెవిల్ సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

5. శృతి హాసన్ :
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో అదరగొట్టింది. అద్భుతమైన హిట్టుతో బాక్సాఫీసును షేక్ చేసిన ఈమె ప్రస్తుతం సలార్ సినిమాలోనూ నటించింది. అయితే మరో రెండ్రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో టికెట్లు బుకింగ్స్ అవుతున్నాయి. ఇదొక్కటే కాకుండా హాలీవుడ్ సినిమా ది ఐ లో కూడా శృతి హాసన్ నటిస్తోంది. అలాగే నాని 30వ సినిమాలో నటించేందుకు కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











