Kill movie: కిల్ రీమేక్ కోసం తెలుగు హీరోలు పోటీ.. ఎవరెవరో తెలుసా?
ప్రతి సినిమా ఇండస్ట్రీలో కూడా కేవలం కొన్ని పెద్ద కాస్టింగ్ ఉన్న సినిమాలే కాకుండా అసలు ఎవరికీ పెద్దగా పరిచయం లేని కొత్త జెనరేషన్ కూడా తమ సినిమాలతో ఝలక్ ఇస్తారు. అలా ఇండియాలో సినీ పరిశ్రమలలో కూడా ఎన్నో చిత్రాలు ఉన్నాయి. ఇంతే కాకుండా ఒక ట్రెండ్ లో వెళ్తున్న కొన్ని సినిమాలకి డిఫరెంట్ గా ఓ సరైన సినిమా వస్తే దాని రెస్పాన్స్ చాలా గట్టిగా ఉంటుంది. మరి అదే తరహాలో ఇప్పుడు రీసౌండింగ్ గా వినిపిస్తున్న ఇండియన్ సినిమానే "కిల్".
చాలా కాలం నుంచి బాలీవుడ్ లో అవే రొటీన్ ఏక్షన్, లవ్, అడల్ట్ సినిమాలే వస్తున్న క్రమంలో ఒక అవుట్ ఆఫ్ ది కాన్సెప్ట్ తో వచ్చిన ఒక బ్రూటల్ యాక్షన్ సినిమానే "కిల్". దీనిని రిలీజ్ కి ముందే హాలీవుడ్ సినిమాల రేంజ్ లో లేపుతూ వచ్చారు. హాలీవుడ్ లో ఉన్న కొన్ని యాక్షన్ సినిమాలు "జాన్ విక్" తో పోలుస్తూ చాలానే హంగామా చేసారు. ఇంతేనా రిలీజ్ కి ముందే హాలీవుడ్ చిత్రం జాన్ విక్ సిరీస్ దర్శకుడు చాడ్ సాహెల్స్కి మరియు లయన్స్ గేట్ వారు కొనేసుకున్నట్టుగా కూడా టాక్ వచ్చింది.

ఇక ఇప్పుడు బాలీవుడ్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం వసూళ్లు కూడా చాలా స్టడీగా కొనసాగిస్తూ సినిమా చూసిన ప్రతి ఒక్కరి మైండ్ ని బ్లాక్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ గా సినిమా కేవలం ఒక్క హిందీలోనే రిలీజ్ అయినప్పటికీ హైదరాబాద్ లాంటి తెలుగు స్టేట్ నగరాల్లో కూడా సాలిడ్ అక్యుపెన్సీ లను సొంతం చేసుకుంటుంది. ఇలా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ రక్త సిక్తంగా సాగే యాక్షన్ డ్రామాపై తెలుగు హీరోల కన్ను పడినట్టుగా తెలుస్తుంది.
కాగా తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేసేందుకు ఇద్దరు యువ హీరోలు చాలా తహతహలాడుతున్నారట. కాగా ఆ హీరోలు ఎవరో కాదు ఒకరు నవ దళపతి సుధీర్ బాబు కాగా మరో హీరో కిరణ్ అబ్బవరం అట. మరి ఈ సినిమా హక్కుల కోసం ఆల్రెడీ నిర్మాత కరణ్ జోహార్ తో వాళ్ళు టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ వీరిలో ఇప్పుడు కిరణ్ అబ్బవరం తప్పుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇప్పుడు బాలీవుడ్ గేమ్ చేంజింగ్ సినిమాగా కిల్ మారగా కంప్లీట్ ఏ సర్టిఫికెట్ తో రిలీజ్ కి వచ్చింది. ఈ సినిమాని రీమేక్ చేయడం అంటే మామూలు విషయం కూడా కాదు మన తెలుగులో హింసాత్మక సినిమాలకి రక్తం కనిపిస్తేనే చాలా అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి. నిజానికి హిందిలో కూడా కిల్ కి కూడా సెన్సార్ వారు ఒప్పుకోలేదట. అయినా కూడా మేకర్స్ పట్టుబట్టి మరీ సెన్సార్ చేయించి రిలీజ్ కి తీసుకొచ్చారు.
ఇక మన తెలుగులో ఈ తరహా సినిమాని అందులో సోల్ మిస్ అవ్వకుండా మెయిన్ గా యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించడంలో ఏమాత్రం తప్పులు చేసినా మేటర్ రివర్స్ అయిపోద్ది. సో మరి ఈ హై ఎండ్ ఎమోషన్స్ అండ్ బ్లడ్ బాత్ సినిమాని తెలుగులో ఎవరు చేస్తారో వేచి చూడాలి. కేవలం 2 గంటల్లోనే ఉండే ఈ సినిమాని దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తెరకెక్కించగా తన్యా మణిక్తల హీరోయిన్ గా నటించింది.


Click it and Unblock the Notifications











