Year Ender 2023: ఈ ఏడాది ఒక్క సినిమా కూడా తీయని స్టార్ హీరోలు వీళ్లే.. ఓ లుక్కేయండి!
మరికొన్ని రోజుల్లో 2023వ సంవత్సరం ముగియనుండగా గుడ్ బై చెప్పేందుకు అంతా సిద్ధమైపోతున్నారు. అలాగే 2024 సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు రెడీగా ఉన్నారు. అయితే గతేడాది చాలా మంది హీరోలు అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించారు. మరికొంత మంది అయితే ఎలాంటి చిత్రాలు చేయలేదు. చేసినా అవి ఈ ఏడాది విడుదల కాకపోవడంతో.. ఏడాది పొడవునూ థియేటర్లలో ఒక్కసారి కూడా కనిపించలేదు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఒక్క సినిమా కూడా చేయకుండా ఉండడం గమనార్హం. అయితే ఈ ఏడాది ఒక్క చిత్రంలోనూ కనిపించని తెలుగు హీరోలు ఎవరో మనం ఇప్పడు తెలుసుకుందాం.
1. రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇది ఈ ఏడాది మాత్రం విడుదల కావట్లేదు. ఇలా 2023లో ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించలేకపోయారు ఈ గ్లోబల్ స్టార్.

2. అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అర్జున్ కూడా పుష్ప తర్వాత మరే చిత్రమూ చేయలేదు. ముఖ్యంగా పార్ట్ 2లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 2023లో మాత్రం థియేటర్లలో కనిపించలేకపోయారు.
3. జూనియర్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీర్ దేవర సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా ఇంకా విడుదల కాలేదు. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. ముఖ్యంగా 2023లో ఈయన ఒక్క చిత్రంలోనూ కనిపించలేదు.

4. మహేష్ బాబు
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈయన గుంటూరు కారం చిత్రంలో చేస్తున్నాడు. అయితే ఈ సిసనిమా ఈ ఏడాది విడుదల కాలేదు. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. ఇలా 2023లో ఈయన థియేటర్ల వద్దకు అస్సలే రాలేరు.

5. నాగార్జున
ఘోస్ట్ సినిమాతో డిజాస్టర్ ను సొంతం చేసుకున్న ఈయన నా సామి రంగ సినిమాతో రాబోతున్నారు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. కానీ 2023లో మాత్రం ఒక్క చిత్రం కూడా రాలేదు.
6. వెంకటేష్
దగ్గుబాటి వెంకటేష్ హీరోగా తాజాగా రాబోతున్న చిత్రం సైంధవ్. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతుండగా.. ఈ సంవత్సరం మాత్రం ఓ వెబ్ సిరీస్ లో కనిపించారు. కానీ సినిమాలు మాత్రం ఏవీ చేయలేదు.


Click it and Unblock the Notifications











