డబ్బు ఉందని సినిమా తీయలేదు.. మా నాన్న నమ్మకాన్ని నిలబెడుతాం
విభిన్నమైన కాన్సెప్స్‌తో వచ్చే సినిమాలను తెలుగు ప్రజలు ఆదరిస్తూనే ఉంటారు. చిన్న చిత్రమైనా విలక్షణంగా ఉంటే చాలూ అని ఇటీవల తెలుగు ప్రేక్షకులు ఎన్నో చిత్రాలను అక్కున చేర్చుకొన్నారు. తాజాగా నూతన నటీనటులు కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం తికమకతాండ. కవల పిల్లలు హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా, యాని, రేఖ నిరోషా హీరో, హీరోయిన్లుగా నటించారు. వెంకట్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాతలు సీ కల్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరుల హాజరయ్యారు. ఈవెంట్‌లో అతిథులు మాట్లాడుతూ..
ట్విన్స్ హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా యాని, రేఖ నిరోషా హీరోయిన్లుగా వెంకట దర్శకత్వంలో వస్తున్న సినిమా తికమకతాండ. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ప్రొడ్యూసర్స్ సి. కళ్యాణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు మరియు ప్రసన్నకుమార్ గారు వచ్చి మూవీ టీం కి అభినందనలు తెలిపారు.

నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ గతంలో ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ కవల పిల్లలు. వారి మాదిరిగానే హీరోలుగా టెక్నిషియన్స్ వచ్చి హీరోలుగా రామ్, హరి మారారు. చిన్న సినిమా బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమాగా ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.
ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ : ఇందాకే సినిమా ట్రైలర్ చూసాము చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది టిఎస్ఆర్ మూవీ మేకర్స్ పై తిరుపతి శ్రీనివాస్ గారు నిర్మించిన ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను. వెంకట్ చాలా కష్టపడే వ్యక్తి కొంచెం టైం పట్టింది దర్శకుడుగా రావడానికి కానీ కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా ఉంటుంది ఈ సినిమా తనకి మంచి సక్సెస్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నా అన్నారు. నిర్మాతలు ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ : తికమకతాండ వినడానికి విచిత్రంగా అనిపించింది. హీరోలు హరికృష్ణ, రామకృష్ణ హీరోయిన్స్ యాని, రేఖా నిరోషాకి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
హీరోలు హరికృష్ణ, రామకృష్ణ మాట్లాడుతూ.. మా దగ్గర డబ్బు ఉందని ఈ సినిమా తీయలేదు. సినిమా మీద ఉండే తపన, అభిరుచి, ప్రేమ, అభిమానంతో చేశాం. మా కోసం మా నాన్నగారు చేసిన ఓ సాహసం. ఆయన మాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతాం అలాగే మా బ్యానర్ పేరుని కూడా నిలబెడతామన్నారు అని అన్నారు.


Click it and Unblock the Notifications











