ఈ వారం విడుదల కాబోతున్న 5 సినిమాలు.. డబ్బింగ్ సినిమాలతో అల్లరి నరేష్ సోలో ఫైట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మళ్ళీ కొన్ని చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటున్నాయి. అలాగే మీడియం రేంజ్ సినిమాలు కూడా పరవాలేదు అనిపిస్తున్నాయి. ముఖ్యంగా సమంత నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ యశోద బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక మొన్న శుక్రవారం వచ్చిన రెండు సినిమాలు కూడా పరవాలేదు అనిపించాయి.
సుడిగాలి సుదీర్ గాలోడు సినిమాతో పాటు హారర్ మూవీ మసూద.. రెండు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకున్నాయి. ఇక వచ్చే శుక్రవారం రోజు అంటే నవంబర్ 25వ తేదీన మరికొన్ని డిఫరెంట్ సినిమాలు రాబోతున్నాయి. ఇక అవన్నీ కూడా దాదాపు చిన్న సినిమాలే అని చెప్పవచ్చు. ముఖ్యంగా అల్లరి నరేష్ తన సినిమాతో రెండు ప్రముఖ డబ్బింగ్ సినిమాలు పోటీ పడబోతున్నాడు.

నరేష్ నటించిన 'ఇట్లు మారేడుమిల్లి' ప్రజానీకం సినిమా కొంత హైప్ అయితే క్రియేట్ చేసింది. కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అల్లరి నరేష్ చివరిగా నాంది సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా ఇలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అలాగే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన బేడియా సినిమా తెలుగులో తోడేలుగా విడుదలవుతుంది. అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమిళంలో సక్సెస్ అయిన లవ్ టుడే సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ రెండిటిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక వీటితోపాటు రణస్థలి అనే మరొక చిన్న సినిమా రాబోతోంది. దాంతో పాటు చెడ్డి గ్యాంగ్ తమాషా అనే మరొక చిన్న సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ శుక్రవారం రాబోతున్న ఈ సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి మంచి ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











