ఆ స్టార్ హీరోయిన్ వల్లే కీర్తి సురేష్‌కి ఆఫర్ .. ఆమె చెప్పకపోతే లేదట
తెలుగు సహా తమిళ్ ఇండస్ట్రీలో కూడా మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. కానీ ఈ రెండు భాషలు సహా హిందీలో కూడా సక్సెస్ అయ్యిన అది కూడా సౌత్ నుంచి వెళ్లిన హీరోయిన్స్ మాత్రం చాలా అరుదే అని చెప్పాలి. ఈ హీరోయిన్స్‌లో ఇప్పుడైతే ఫుల్ ఫామ్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కనిపిస్తుంది. కానీ తన కంటే ముందే తెలుగు, తమిళ సినిమాలో పాగా వేసి హిందీలో కూడా మంచి సక్సెస్ ని చూసిన స్టార్ హీరోయిన్ మాత్రం సమంత అని చెప్పవచ్చు.
సామ్ ఇపుడు తన స్టార్డంతో దాదాపు నార్త్ లోనే సెటిల్ అయ్యిపోయింది. ఇక వీరితో పాటుగా సౌత్ లో స్టార్డం చూసి నార్త్ లో అదృష్టం పరీక్షించుకోడానికి వెళ్లిన మరో బ్యూటీ ఎవరన్నా ఉన్నారు అంటే అది మహానటి కీర్తి సురేష్. అయితే కీర్తి సురేష్ సౌత్ లో సరైన హిట్స్ లేకపోయినప్పటికీ హిందీలో వచ్చిన ఛాన్స్ కోసం తను అంతకు మించే ఎఫర్ట్స్ పెట్టేసింది.

కెరీర్ లో ఎప్పుడూ లేనిది స్కిన్ షో చేయడం హాట్ హాట్ గా హీట్ ఎక్కించే రకంగా మారిపోయింది. ఐతే చాలా మంది హిందీ సినిమాలోకి వెళితే ఇక ఏ హీరోయిన్ అయినా ఇలానే చేయాల్సిందే అనే ఒక మార్క్‌కి కీర్తి కూడా అతీతం కాదు అని బేబీ జాన్ ప్రూవ్ చేసుకుంది. అయితే హిందీలో ఆమె నటించిన మొదటి సినిమా ఇది. తమిళ సెన్సేషనల్ హిట్ చిత్రం "తేరి" కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిందని అందరికీ తెలుసు.
పైగా ఆ తమిళ్ వెర్షన్ దర్శకుడు అట్లీనే హిందీలో నిర్మాణం వహించాడు. సో అలా కీర్తి సురేష్ హిందీలో ఎంట్రీ ఇచ్చింది అని చాలా మంది అనుకున్నారు. కానీ కీర్తి మాత్రం అసలు విషయాన్ని రీసెంట్ గా రివీల్ చేసింది. తాను హిందీ సినిమాలో ఎంటర్ కావడానికి కారణం సమంత అని చెప్పిందట. నిజానికి ఒరిజినల్ తేరి సినిమాలో సమంత చేసిన పాత్రనే కీర్తి సురేష్ హిందీలో చేసింది.

హిందీలో సినిమా చేద్దాం అనుకున్నపుడు సామ్‌తో కూడా చర్చించగా కీర్తి సురేష్ పేరుని ఆమెనే ముందు సజెస్ట్ చేసిందట. సో అలా సమంత వల్లే ఆమెకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది అని కీర్తి సామ్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పుకొచ్చింది. అయితే తమిళ్ వెర్షన్‌లో సమంత రోల్ చాలా హోమ్లీ గా ఉంటుంది.
కానీ కీర్తి సురేష్ రోల్ మాత్రం హిందీలో చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. ఇలా ఇంత చేసినప్పటికీ కీర్తి సురేష్ హిందీలో కూడా హిట్ అందుకోలేకపోయింది. బేబీ జాన్ హిందీలో భారీ డిజాస్టర్ గా నిలిచిపోయింది. మొన్న క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ చిత్రం ఓపెనింగ్స్ కూడా డల్ గానే అందుకోగా డే 2 నుంచే బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయింది.


Click it and Unblock the Notifications











