కుటుంబంలో గొడవలు.. మంచు లక్ష్మి ఎక్కడ , అక్కపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..

ఇపుడు టాలీవుడ్‌కి సంబంధించి పలువురు స్టార్స్ విషయంలో పలు ఇంట్రెస్టింగ్ వార్తలే కొద్దిరోజులుగా బయటికి వస్తున్నాయి. కాగా ఈ అంశాల్లో కంప్లీట్‌గా ఒక్క విషయం మాత్రం మిగిలిన అన్నింటిని డామినేట్ చేసేసింది అని చెప్పాలి. ఈ బిగ్గెస్ట్ హైలైట్ అండ్ కాంట్రవర్సీ అంశమే మంచు వారి ఇంట గొడవలు.

అయితే దీనికి అసలు కారణం ఏంటి అని ఎవరూ పూర్తిగా ఓపెన్ కావడం లేదు. కానీ ముఖ్యంగా అయితే ఆస్తుల విషయంలోనే ఈ గొడవలు జరుగుతున్నాయి అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. కాగా మంచు మనోజ్ కి రావాల్సిన ఆస్తిలో తన తండ్రి మోహన్ బాబు అన్యాయం చేశారు అంటూ వెర్షన్ వినిపిస్తోంది. అయితే మంచు మనోజ్ మాత్రం నాకు ఆస్తి కాదు నా కుటుంబం జోలికి రాకుండా .. ఏదన్నా ఉంటే నాతో తేల్చుకోవాలని సవాలు చేస్తున్నాడు.

this is what manchu lakshmi doing on manchu family war

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ నిన్న రాత్రి నుంచి అసలు రచ్చ స్టార్ట్ అయ్యింది. నేరుగా మోహన్ బాబు రంగం లోకి దిగడం, మీడియా వాళ్లపై దాడులు చేయడం, అలాగే మంచు మనోజ్ పై ఆడియో టేపు కూడా వదలడం అనేది షాకింగ్ గా మారాయి. మరోవైపు మంచు విష్ణు కూడా రంగంలోకి దిగాడు. తాను చేస్తున్న భారీ చిత్రం కన్నప్ప ని పక్కన పెట్టేసి హుటాహుటిన దుబాయ్ నుంచి ఇండియాకి బయలుదేరి వచ్చేసాడు.

ఈ గొడవల విషయంలో తన తల్లి కూడా ఎంతో బాధ పడుతున్నారు అని విష్ణు తెలిపారు. ఇలా కుటుంబంలో గొడవలు, హీట్ వాతావరణం ఉంటే మంచు లక్ష్మి ఏమైనట్టు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె అని తనకి రావాల్సింది తాను తీసుకొని ముంబై వెళ్ళిపోయింది అంటూ ఫిలింనగర్‌లో పలు రూమర్స్ అయితే వినిపించాయి.

this is what manchu lakshmi doing on manchu family war

ఈ సంగతి పక్కనపెడితే.. నిన్న రాత్రి నుంచి మంచు వారి ఇంట హీట్ మామూలు రేంజ్‌లో లేదు .. కానీ మంచు లక్ష్మి మాత్రం సింపుల్ గా సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఈ ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో తన తండ్రి తమ్ముళ్ల మధ్య అంత యుద్ధం జరుగుతుంటే లక్ష్మి ఇంత లైట్ తీసుకోవడం అనేది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇక మంచు విష్ణు కూడా తన అక్క పై చేసిన పలు కామెంట్స్ ఇపుడు ఆసక్తి రేపుతున్నాయి. తనకి , తన అక్కకి భేదాభిప్రాయాలు ఉన్నాయి అని సంచలన విషయం బయటపెట్టాడు. ఆమె కొట్టినా తిట్టినా నేను పడతాను అంటూ విష్ణు చేసిన కామెంట్స్ ఇపుడు కొత్త ప్రశ్నలు రేపుతున్నాయి. మంచు వారి ఇంట్లో ఇంత రచ్చ జరుగుతున్నా మంచు లక్ష్మి మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కనీసం ఏ ఒక్కరి వైపు కూడా ఆమె స్టాండ్ తీసుకోకపోవడం అనేది ఒకింత మంచు వారి ఫ్యాన్స్‌కి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X