పుష్ప 2 కొత్త పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా? తెలివిగా స్టోరీని లీక్ చేసిన సుకుమార్
ప్యాన్ ఇండియా మార్కెట్ లో తనకంటూ సొంతం ఇమేజ్ ని సొంతం చేసుకున్న అతి కొద్ది మంది స్టార్ హీరోస్ లో అది కూడా మన తెలుగు నుంచి ఉన్న హీరోస్ లో అయితే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడే అని చెప్పాలి. రాజమౌళి బ్రాండ్ లేకుండా అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు కానీ మన తెలుగు స్టేట్స్ లో మెగా ఫ్యాన్స్ మధ్య మాత్రం ఇప్పుడు కాంట్రవర్సీ టాపిక్ గా మారిపోయాడు.
ఇవి పక్కన పెడితే ఇపుడు బన్నీ చేస్తున్న భారీ చిత్రం "పుష్ప 2 ది రూల్" కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ అహర్నిశలు కస్టపడి తెరకెక్కిస్తున్నారు. కానీ ఇది ఎంతకీ పూర్తి కావడం లేదు. ఒక్క ఇంటర్వెల్ బ్లాక్ కోసమే రెండు మూడు నెలలు షూట్ చేసేసరికి ఇక మిగతా సినిమా పూర్తి కావడానికి సమయం లేకపోయింది.

అప్పటికే ఏకకాలంలో రెండు మూడు యూనిట్ లు షూటింగ్ చేస్తున్నారు కానీ షూటింగ్ మాత్రం అనుకున్న టార్గెట్ లోపు పూర్తయ్యేలా లేదని ఒక అంచనాకి వచ్చాక ఆగస్ట్ నుంచి డిసెంబర్ కి వాయిదా వేసినట్టుగా అల్లు అర్జున్ పై ఒక మాస్ పోస్టర్ ని రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు.
అయితే ఈ పోస్టర్ ని సరిగ్గా కూడా అల్లు అర్జున్ కఠాన లాంటి కత్తి పట్టుకొని తలకి గుడ్డ కట్టుకుని అదిరే మాస్ లుక్ లో కనిపించాడు. దీనితోనే ఇది యాక్షన్ సీక్వెన్స్ అని అర్ధం అయ్యిపోయింది. అయితే అసలు ఈ పోస్టర్ వెనుక ఉన్న అసలు కథ వినిపిస్తుంది. వైరల్ అవుతున్న ఓ కథనం ప్రకారం ఈ పోస్టర్ లో కనిపించే పోరాట సన్నివేశం జపాన్ లేదా చైనా లో కనిపిస్తుందని వినిపిస్తుంది.

అప్పటికే పుష్ప కథాంశం ప్రకారం చైనా, జపాన్ నేపథ్యంలో కూడా జరుగుతుంది అని తెలిసిందే. అలా పుష్ప ని టార్గెట్ చేసిన జపాన్ మూకలతో అల్లు అర్జున్ పై డిజైన్ చేసిన ఒక స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లోనిదే ఇది అని వినిపిస్తుంది. కాగా ఈ సీన్ మొత్తాన్ని ఫైట్ మాస్టర్ పీటర్ హైన్ సారథ్యంలో చేసారని వినికిడి.
మొత్తానికి అయితే పుష్ప 2 లో మాత్రం ఒక ఊహించని లెవెల్ యాక్షన్ కూడా బన్నీ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పాలి. కాగా ఈ సినిమాలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అనసూయ, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











