చరణ్‌తో మంచు లక్ష్మి కూతురు.. ఈ పిక్ ప్రత్యేకత ఏమిటో తెలుసా?
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రామ్ చరణ్ ఫోటో షేర్ చేశారు. ఇందులో చెర్రీతో కలిసి మంచు లక్ష్మికూతురు విద్యా నిర్వాణ కూడా ఉండటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఫోటోకు ఓ ప్రత్యేకత ఉందట. సరిగ్గా ఇలాంటి ఫోటోనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిందట మంచులక్ష్మి.
ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ... ఈ ఫోటో నన్ను పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది. మీ నాన్నతో కలిసి నేను చిన్నతనంలో ఇలాంటి ఫోటోనే దిగాను. ఇది చూస్తుంటే లైఫ్ ఫుల్ సర్కిల్ తిరిగింది అనిపిస్తోంది. మన కుటుంబ బంధం ఇలానే దీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంటున్నాను. నీకు పిల్లలు పుడితే యాపిల్(విద్యా నిర్వాణ) వారికి పెద్ద అక్కయ్య అవుతుంది. అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టిన నీకు వెల్ కం.... అంటూ మంచు లక్ష్మి పేర్కొన్నారు.

ఇప్పటి వరకు రామ్ చరణ్ కేవలం ఫేస్‌బుక్ అధికారిక ఖాతా మాత్రమే మెయింటేన్ చేస్తూ వచ్చాడు. గతంలో ట్విట్టర్ ఖాతా కూడా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఖాతాను క్లోజ్ చేశాడు. చాలా రోజుల తర్వాత చరణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల విషయానికొస్తే... రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు చరణ్ నిర్మాతగా 'సైరా నరసింహారెడ్డి' చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











