ఎంఎస్ ధోనికి నటుడుగా రాంగోపాల్ వర్మ ఛాన్స్.. ఇదెలా జరిగిందో తెలుసా?

మన దేశపు జనాభాలో మాతృభూమి పట్ల ప్రేమ, గౌరవంలు ఎంత మెండుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో రంగాల్లో రాణిస్తున్న భారతీయులు క్రికెట్ లో కూడా ఎంతో ప్రావిణ్యం ఉన్నవారు ఉన్నారు. కాగా మన దేశంలో సినిమాలతో పాటుగా క్రికెట్ కి కూడా జనం పెద్ద పీఠ వేస్తారు. ఇలా థియేటర్స్ కి రావడానికి అయితే క్రికెట్ చూసేందుకు విదేశాలకి వెళ్ళడానికి లక్షలు ఖర్చు పెట్టి వెళుతూ ఉంటారు.

మరి సినిమాల పరంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోలు ఎలాగైతే ఉంటారో అదే విధంగా క్రికెట్ లో కూడా అపారమైన జనాదరణ కలిగి ఉన్న క్రికెటర్స్ కొంతమంది ఉన్నారు. మరి వారిలో లెజెండరీ సచిన్ టెండుల్కర్ ఎరా ఒకటైతే తన తర్వాత వచ్చిన భారత జట్టు కెప్టెన్ మిస్టర్ కూల్ ఎం ఎస్ ధోని కూడా ఒకరు. తన ప్రెజెన్స్ గ్రౌండ్ లో ఉంటే చాలు అనే రేంజ్ లో తనకి విశేష ఆదరణ ఉంది. అయితే ధోని అప్పట్లోనే సాలిడ్ ట్రెండ్ సెట్ చేసాడు.

this sensational director gave cinema chance to ms dhoni

తన లుక్స్ తో కానీ బ్యాటింగ్ స్టైల్ తో కానీ ఒక ట్రెండ్ ధోని సెట్ చేసాడు. ఇలా తన స్టైల్ ని చాలా మంది ఫాలో అయ్యేవారు. అంతెందుకు సినిమా వారు కూడా తన హెయిర్ స్టైల్ ని ఫాలో అయ్యేవారు లేకపోలేరు. కాగా ఇలా ధోని మంచి పాపులారిటీ సొంతం చేసుకోగా తనని నటుడుగా కూడా చూడాలని చాలా మంది అనుకున్నారు. కానీ ఎంఎస్ ధోనికి ఓ సెన్సేషనల్ దర్శకుడు నటుడుగా అవకాశం ఇచ్చారన్న విషయం మీకు తెలుసా?

అవును ఇది నిజమే మహేంద్ర సింగ్ ధోనికి ప్రముఖ దర్శకుడు, సంచలనాల రామ్ గోపాల్ వర్మ తన సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చారట. కాగా ఇది అంతా ధోని కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన విషయం అట. కాగా ధోని కెరీర్ స్టార్టింగ్ నాటికి వర్మ అంటే పాన్ ఇండియా లెవెల్లో తెలుసు. హిందీ మార్కెట్ లో కూడా రామ్ గోపాల్ వర్మకి అప్పట్లోనే మంచి క్రేజ్ ఉంది.

this sensational director gave cinema chance to ms dhoni

అలా ధోనికి కూడా రామ్ గోపాల్ వర్మ ఎవరో తెలుసు కానీ వర్మకి ధోని ఎవరో తెలియదట. అలా ధోని, వర్మని ఎయిర్పోర్ట్ లో కలిసి హాయ్ చెప్పాడట. కానీ వర్మ ధోనికి తన కార్డు ఇచ్చి ఆఫీస్ కి కాంటాక్ట్ అవ్వు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారట. దీనితో ధోని తనని గుర్తు పట్టలేదు అని నవ్వుకున్నాడట. ఇలా అప్పట్లోనే ఎం ఎస్ ధోనికి సినిమా ఛాన్స్ ని ఇచ్చిన దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ మారాడు అని చెప్పాలి.

అయితే ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఇండియా వైడ్ గా ఎలాంటి ఫేమ్ తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మరో పక్క అప్పట్లోనే అలాంటి క్రేజ్ ను చూరగొన్న వర్మ పరిస్థితి ఇప్పుడెలా ఉందో కూడా తెలుగు ఆడియెన్స్ కి తెలుసు. ఇప్పటికీ వర్మ తన కెరీర్ ని తానే నాశనం చేసుకున్నాడని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. వర్మకి ఉన్న టాలెంట్ ని సరిగ్గా వాడుకొని ఉంటే ఇండియాకి దర్శకుడుగా ఆస్కార్ ని తెచ్చే సత్తా ఉన్నవాడు అంటుంటారు కొందరు. కానీ ఇపుడు బి గ్రేడ్ సినిమాల కంటే దారుణమైన సినిమాలు తాను అందించడం బాధాకరం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X