47 మంది కొత్త హీరోయిన్లతో రొమాన్స్ , నాగార్జున కాదు .. ఆ టాలీవుడ్ యంగ్ హీరో ఎవరంటే?

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు వేలాది మందికి ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉపాధిని కల్పిస్తోంది. కేవలం తెలుగువారే కాకుండా ఎంతో మంది పరభాషా నటులు కూడా ఈ ఇండస్ట్రీలో తమకంటూ స్థానం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక తెలుగు తెరకు కొత్త డైరెక్టర్లను, నిర్మాతలను, హీరోయిన్లను , టెక్నీషియన్లను పరిచయం చేయడంలో అప్పట్లో సూపర్‌స్టార్ కృష్ణ ముందుండేవారు. ఆ తర్వాతి తరంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఎంతోమంది కొత్త వారికి అవకాశాలు కల్పించారు.

ఇదిలాఉండగా.. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడు, కామెడీ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఏడాదికి నాలుగైదు సినిమాలతో సందడి చేసి నవ్వుల పువ్వులు పూయించారు అల్లరి నరేష్. అంతేకాదు.. ఈ జనరేషన్‌లో అత్యంత వేగంగా 50కి పైగా సినిమాలు చేసిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటకిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీని హీరోగా చేసిన వ్యక్తిగా నరేష్ క్రేజ్ సంపాదించారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ అల్లరోడిలో మనుపటి స్పీడ్ కనిపించడం లేదు. సినిమాలు ఒకదానికొకటి ఫ్లాప్ అవుతుండటంతో ఆయన కెరీర్‌ డౌన్‌ఫాల్ అయ్యింది.

this tollywood hero introduced 47 new heroines to telugu film industry

కామెడీని పండిస్తూనే సీరియస్ పాత్రలు చేస్తూ తనలోని అసలు సిసలు నటుడిని పరిచయం చేసి ఏడిపించాడు నరేష్. గమ్యం, నాంది, మహర్షి , ఉగ్రం, మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాలు నరేష్‌కు నటుడిగా పేరు తీసుకొచ్చాయి. కానీ తన స్థాయికి తగ్గ హిట్ అందుకుని చాలా రోజులైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న '' ఆ ఒక్కటి ఆడక్కు ''కు మంచి బిజినెస్ జరిగినా , బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది.

కానీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు నరేష్. ఆయన లేటెస్ట్ మూవీ ''బచ్చల మల్లి ''. 1990వ దశకంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మంచి ప్రయత్నమని మెచ్చుకున్నారు తప్పించి బాక్సాఫీస్ వద్ద పూర్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పుష్ప 2, ముఫాసా : ది లైన్ కింగ్, విడుదల 2 వంటి సినిమాలు పోటీలో ఉన్న దశలో రాకుండా ఉండాల్సిందని నరేష్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే.. అల్లరి నరేష్ ఇప్పటి వరకు 65 సినిమాల్లో నటించారు. 2015 వరకు ఏడాదికి సగటును మూడు సినిమాలు తగ్గకుండా చేస్తూ వచ్చిన ఆయన తర్వాత సంవత్సరానికి ఒక్క సినిమాకే పరిమితమయ్యారు. అయితే అల్లరి నరేష్‌ తీసిన ఇన్ని సినిమాలలో ఓ ప్రత్యేకత కూడా ఉంది. కెరీర్‌లో దాదాపు 40 మందికి పైగా కొత్త దర్శకులను , 47 మందికి పైగా కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ ఈ విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X