This week Movie Releases: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. అక్షయ్ కుమార్‌పైనే బాలీవుడ్ ఆశలు

చూస్తుండగానే జూన్ నెల చివరి వారానికి వచ్చేశాం. థియేటర్‌లలో మా ఇంటి బంగారం, కాక్‌టెయిల్ 2 వంటి సినిమాలు సందడి చేస్తున్నాయి. మంచి కథ, ఇంట్రెస్టింగ్ స్టోరీ పాయింట్‌తో ఈ మూవీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఈ వారం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏయే సినిమాలు విడుదల కానున్నాయి. అనేది పరిశీలిస్తే..

This Week Movie Releases Akshay Kumar s welcome to the jungle Arjun Das s Con City amp amp More Films Hitting Theatres

వెల్‌కమ్ టూ ది జంగిల్
జూన్ చివరిలో వస్తున్న ఏకైక పెద్ద సినిమా, హిందీ సినిమా వెల్‌కమ్ టూ ది జంగిల్. బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సి, జాకీష్రాఫ్, పరేష్ రావల్, రవీనా టాండన్, లారా దత్తా, ఫరియా దలాల్ సహా భారీ స్టార్ క్యాస్టింగ్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఏఏ నడియాద్ వాలా, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, స్టార్ స్టూడియో 18 సంస్థలు వెల్‌కమ్ టూ ది జంగిల్ మూవీని తెరకెక్కిస్తున్నాయి. ఏ నదియాద్ వాలా, రాకేష్ దంగ్, వేదాంత్ వికాస్ బాలీలు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. కబీర్ లాల్ సినిమాటోగ్రాఫర్‌గా, నితిన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. విక్రమ్ మోన్‌ట్రోస్, తల్వీందర్, ఆనంద్ రాజ్ ఆనంద్, సాజిద్- వాజిద్ తదితరులు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 26న వెల్‌కమ్ టూ ది జంగిల్ మూవీ విడుదల కానుంది.

పెళ్లైంది కానీ నో కహాని
ఈ వారం తెలుగులో విడుదల అవుతున్న ఏకైక సినిమా ఇదే. శ్రీహరి, స్మిత జంటగా నటించగా.. తాడిశెట్టి ఏడుకొండలు దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మై3 సినిమాస్ బ్యానర్‌పై నిర్మించగా.. బాలు కే లేరాగ్ సంగీతం అందించారు. జూన్ 26న పెళ్లైంది కానీ నో కహానీ మూవీ విడుదల కానుంది.

కాన్ సిటీ
ఓజీ ఫేమ్ అర్జున్ దాస్ హీరోగా నటించిన మూవీ కాన్ సిటీ. అన్నా బెన్ హీరోయిన్‌గా నటించగ.. యోగిబాబు, వడివుక్కరసి, అఖిలన్, సాక్షి వైద్య, నంద గోపాల్, వీటీవీ గణేష్, దీప రామానుజం, రాధారవి, అరుల్ దాస్, షాజీ చెన్ తదితరులు నటించగా హరీశ్ దురైరాజ్ దర్శకత్వం వహించారు. పవర్ హౌస్ పిక్చర్స్, మాలీ అండ్ మాన్వీ మూవీ మేకర్స్, క్లౌట్ స్టూడియోస్, సిల్వర్ ట్రీ స్టూడియోస్ సంస్థలు కాన్ సిటీ మూవీని నిర్మించాయి. సియాన్ రోల్డన్ సంగీతం అందించగా.. అరుల్ మోసెస్ ఎడిటర్‌గా, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. కాన్ సిటీ మూవీ తెలుగు, తమిళ భాషల్లో జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అంగీకారం
కేజేఆర్, విజీ వెంకటేష్, రంగరాజ్ పాండే, వసుంధర కశ్యప్, మన్సూర్ అలీఖాన్ తదితరులు నటించిన మూవీ అంగీకారం. థెన్‌పాథియన్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వస్తిక్ విజన్స్ బ్యానర్‌పై ఎస్‌కే ప్రశాంత్, అజిత్ భాస్కర్, అరుణ్ మురుగన్‌లు నిర్మించారు. గిబ్రాన్ వైబోధ సంగీతం అందించగా.. విశ్వనాథ్ సినిమాటోగ్రాఫర్‌గా, దినేష్ ఎడిటర్‌గా వ్యవహరించారు. అంగీకారం మూవీ తెలుగు, తమిళ భాషలలో జూన్ 26న విడుదల కానుంది.

భాస్కరాభరణం
రూపేశ్ పీతాంబరన్, సోనిక మీనాక్షి, అజయ్ పవిత్రన్, మిథున్ ఎం దాస్, పార్వతి కలరిక్కల్ నటించిన మూవీ భాస్కరాభరణం. రూపేశ్ పీతాంబరన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. నికాఫ్ స్టూడియోస్, గుడ్ ఫిల్లాస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అర్ముగం కే గౌడ, రూబీ పీతాంబరన్, రూపేశ్ పీతాంబరన్‌లు ఈ సినిమాను నిర్మించారు. ఉమ కుమారపురం సినిమాటోగ్రాఫర్‌గా, రాశిన్ అహ్మద్ ఎడిటర్‌గా, గాడ్విన్ థామస్ మ్యూజిక్ డైరెక్టర్‌‌గా వ్యవహరించారు. మలయాళంలో జూన్ 26న భాస్కరాభరణం సినిమా రిలీజ్ కానుంది.

పైన పేర్కొన్నవి కాకుండా.. జూన్ 26న కన్నడంలో బలరామ దినగళు, అంబర గుడ్డ, శ్రీకృష్ణ, గరుడ.. తమిళంలో లక్ష్మీకాంతన్ కొలై వాజక్కు, హార్టిన్.. మలయాళంలో ఉయిర్, ఇంగ్లీష్‌లో ది ఇన్వైట్, సూపర్‌ గర్ల్ సినిమాలు విడుదల అవుతున్నాయి. మరి వీటితో ఏవి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటాయో చూడాలి.

Read more about: akshay kumar arjun das
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X