This Week Movie Releases: బ్లాస్ట్‌జోన్, మరీచిక, మసూద్ ఖాన్.. ఇంకా ఈ వారం రిలీజయ్యే సినిమాలు ఇవే!

చూస్తుండగానే మే చివరి వారంలోకి వచ్చేశాం.. కానీ ఈ వేసవి ప్రేక్షకులకు ఎలాంటి వినోదం అందించలేదు. పెద్ద సినిమాలన్నీ ఒకదాని తర్వాత మరొకటి వాయిదా పడటంతో ప్రేక్షకులు సినిమా అనుభూతిని మిస్ అయ్యారు. అయితే చిన్న సినిమాలు కొంతమేరకు ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పలు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ వివరాలు పరిశీలిస్తే..

This Week Movie Releases Blast zone Mareechika and Kattalan and more filims coming on theaters

బ్లాస్ట్‌జోన్:
యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ బ్లాస్ట్‌‌జోన్. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్‌లు నిర్మించగా.. సుభాష్ కే రాజ్ దర్శకత్వం వహించారు. రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహించగా.. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా, అరుణ్ రాధాకృష్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మే 28న తెలుగు, తమిళ భాషల్లో బ్లాస్ట్‌జోన్ మూవీ విడుదల కానుంది.

మరీచిక:
అనుపమ పరమేశ్వరన్, రెజీనా, విరాజ్ అశ్విన్ కీలకపాత్రల్లో నటించిన మూవీ మరీచిక. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, మేఘనా చిలకా నిర్మించగా.. సతీష్ కశెట్టి దర్శకత్వం వహించారు. అరవింద్ కన్నబిరన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. మ్యూజిక్ మేస్ట్రో, లెజెండరీ ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించారు. మే 29న మరీచిక మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మసూద్ ఖాన్ పార్ట్ 1: ది రేజ్:
పూజ శర్మ, రాధిక వేలమూరి, అశోక్ కుమార్ కీలకపాత్రల్లో హార్రర్, కామెడీ, ఫ్యామిలీ జోనర్‌లో తెరకెక్కిన మూవీ మసూద్ ఖాన్ పార్ట్ 1: ది రేజ్. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అశోక్ కుమార్ జీ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మసూద్ ఖాన్ పార్ట్ 1: ది రేజ్ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాటాలన్:
మలయాళ స్టార్ హీరో ఆంటోనీ వర్గీస్ హీరోగా తెరకెక్కిన మూవీ కాటాలన్. దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించగా.. సునీల్, కబీర్ దుహన్ సింగ్, పార్థ్ తివారీ, జగదీష్, సిద్ధిఖీ, హనన్ షా, హిప్జాటర్ తదితరులు నటించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మొహమ్మద్ నిర్మించగా.. పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహించారు. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో మే 28న కాటాలన్ విడుదల కానుంది.

ఇవి కాకుండా మే 29న సందిగ్థం, మే 31న విభో సినిమాలు తెలుగులో విడుదల కానున్నాయి. మే 29న రేజ్, ఈగో రామన్‌లో తమిళంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మే 28న మలయాళంలో కరక్కమ్ అనే మూవీ రిలీజ్ అవుతోంది. ఇక ఈ వారం హిందీలో అత్యధిక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. హీర్ సారా ఔర్ పాండిచ్చేరి, ఓబెసెస్, శ్రీ బాబా నీబ్ కరోరి మహరాజ్, కృష్ణ ఔర్ చిట్టి, రిటర్న్ ఆఫ్ ది జంగీల్, రజనీ కి బారాత్, డ్రాప్ ఔట్, నవ గుంజర సినిమాలు మే 29న హిందీలో రిలీజ్ కానున్నాయి. అలాగే ఇంగ్లీష్‌లో ఒబెసన్, ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో, ప్యాసెంజర్, ట్యూనర్ సినిమాలు మే 29న ఆంగ్ల భాషలో విడుదల కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X