This Week Movie Releases: దృశ్యం 3, పురుష:, వదలా.. ఇంకా ఈ వారం రిలీజయ్యే సినిమాలు ఇవే!

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా థియేటర్‌లలో సందడి చేయడానికి సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్‌లతో పాటు చిన్న హీరోలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషలలో ఈ వారం ఏమేం సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూస్తే..

This Week Movie Releases Drishyam 3 Vadala Ugly Story And More Movies To Watch

దృశ్యం 3:
దక్షిణాదితో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను కొన్నేళ్లుగా అలరిస్తోన్న క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం ఫ్రాంచైజీ నుంచి వస్తోన్న మూడో భాగం దృశ్యం 3. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, సీనియర్ నటి మీనా జంటగా నటించగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, సిద్దిఖీ, మురళి గోపి, కేబీ గణేష్ కుమార్, వీనా నందకుమార్, ఇర్షద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్, పెన్ స్టూడియోస్, పనోరమ స్టూడియోస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్ దృశ్యం 3ని నిర్మించారు. సమ్మర్ కానుకగా మే 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

వదలా:
సీనియర్ హీరో జగపతి బాబు కీలకపాత్ర పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ వదలా. లయ, హృతిక శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు. ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించగా.. చరిత చిత్ర బ్యానర్‌పై తమ్మారెడ్డి భరద్వాజ, కిశోర్ నాయుడు చిరుమామిళ్ల ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా.. కార్తీక్ బీ కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మే 22న వదలా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అగ్లీ స్టోరీ:
నందూ, అవికా గోర్ జంటగా ప్రణవ స్వరూప్ తెరకెక్కించిన చిత్రం అగ్లీ స్టోరీ. జేఎస్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రవిజేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రగ్యా తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించగా.. శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, మిథున్ సోమ, శ్రీకాంత్ పట్నాయక్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సమ్మర్ కానుకగా మే 22న అగ్లీ స్టోరీ విడుదల కానుంది.

పురుష:
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం పురుష: వీరూ ఉలవల దర్శకత్వం వహిస్తుండగా.. సరస్వతి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, రాజ్ కసిరెడ్డి, వైష్ణవి కొక్కుర, విషిక, హషినీ సుధీర్, శ్రీ సంధ్య, గాబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మీ సాయి, వీటీవీ గణేష్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీత దర్శకత్వం వహించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా, కోటీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మే 22న ఈ సినిమా విడుదల కానుంది.

ఆంధ్రావాలా (రీ రీలీజ్)
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 20వ తేదీన ఆంధ్రావాలా సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే డిజాస్టర్లలో ఒకటైన ఈ సినిమాను శ్రీ భారతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై గిరి ఆర్ఆర్ వెంకట్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రక్షిత, సంఘవీలు హీరోయిన్‌లుగా నటించారు. సయాజీ షిండే, రాహుల్ దేవ్, బెనర్జీ, నాజర్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

చాంద్ మేరా దిల్
అనన్య పాండే, లక్ష్య జంటగా ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరూ యష్ జోహర్, కరణ్ జోహార్, అదర్ పూణావాలా, అపూర్వ మెహతా, సొమెన్ మిశ్రా, మరిజికే డిసౌజాలు నిర్మించగా వివేక్ సోనీ దర్శకత్వం వహించారు. సచిన్ జిగర్ సంగీతం అందిస్తున్నారు. మే 22న చాంద్ మేరా దిల్ హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవికాకుండా మే 22వ తేదీన తమిళంలో డార్క్ జెయింట్.. మలయాళంలో డోస్.. కన్నడంలో సెప్టెంబర్ 21, గజానన క్రికెటర్స్, మక్కల సైన్య.. ఇంగ్లీష్‌లో స్టార్ వార్స్ ది మాండోలరియన్ అండ్ గ్రోగ్ సినిమాలు విడుదల అవుతున్నాయి.

Read more about: Drishyam 3 movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X