This Week Movie Releases: వీరభద్రుడిగా సూర్య.. సంజయ్ దత్ ఆఖరి సవాల్, ఇంకా ఈ వారం రిలీజయ్యే సినిమాలు ఇవే!

మరికొద్దిరోజుల్లో సమ్మర్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటికే మే నెల రెండో వారంలోకి వచ్చేశాం. కానీ థియేటర్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు మాత్రం రిలీజ్ కావడం లేదు. బడా సినిమాల సందడి లేక ఈ సమ్మర్ వెలవెలబోయింది. అయితే ప్రతివారం మాదిరిగానే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు చిన్నా పెద్దా సినిమాలు రెడీ అయ్యాయి. భారీ చిత్రాలు విడుదల అవుతాయని భావించినప్పటికీ.. ఉన్నంతలో క్రేజ్ ఉన్న సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ అనేది పరిశీలిస్తే..

This Week Movie Releases Karuppu Pati Patni Aur Woh Do and More Filims coming on Theaters

వీరభద్రుడు
కోలీవుడ్ సూపర్‌స్టార్ సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కరుప్పు. తెలుగులో వీరభద్రుడిగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ వీరభద్రుడు సినిమా మే 14వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆర్జే బాలాజీ, ఇంద్రణ్స్, నట్టి సుబ్రహ్మణ్యం, శ్వాసిక, శివద, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు, మన్సూర్ అలీఖాన్, జార్జ్ మరియన్, దీపా శంకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read
త్రిషతో పెళ్లికి విజయ్ ఫ్యామిలీ ఓకేనా? ప్రమాణ స్వీకారంలో దళపతి తల్లి షాకింగ్ రియాక్షన్
త్రిషతో పెళ్లికి విజయ్ ఫ్యామిలీ ఓకేనా? ప్రమాణ స్వీకారంలో దళపతి తల్లి షాకింగ్ రియాక్షన్

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్:
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. మధుదీప్ చెలికాని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. మే 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అనిష్ కురువిల్ల, శివాజీ రాజా, హర్షవర్ధన్, సత్య కృష్ణన్, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, సప్తగిరి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. లోటస్ క్రియేటివ్ వర్క్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం ఈ సినిమాను నిర్మించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, రవికుమార్ వీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. అరుణ్ చిలివేరు, ప్రకాష్ చెరుకూరిలు సంగీతం అందించారు.

Recommended For You
నువ్వులేని లోటు ఎప్పటికీ తీరదు... అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్, ఏం జరిగిందంటే?
నువ్వులేని లోటు ఎప్పటికీ తీరదు... అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్, ఏం జరిగిందంటే?

పతీ పత్నీ ఔర్ వో దో:
బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖొరానా హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, వామికా గబ్బిలు హీరోయిన్లుగా నటించిన మూవీ పతీ పత్ని ఔర్ వో దో. టీ సిరీస్- బీఆర్ స్టూడియోస్‌ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా, కృషన్ కుమార్‌లు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ముదసర్ అజీజ్ దర్శకత్వ వహిస్తున్నారు. విజయ రాజ్, విశాల్ వశిష్ట, దుర్గేష్ కుమార్, దీపిక అమీన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రాఫర్‌గా, నినాద్ ఖాన్లోకర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా 8 మంది సంగీత దర్శకులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 15న పతీ పత్ని ఔర్ వో దో మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

You May Also Like
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్

ఆఖరి సవాల్
బాలీవుడ్ నట దిగ్గజం సంజయ్ దత్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా ఆఖరి సవాల్. అభిజిత్ మోహన్ వారంగ్ దర్శకత్వం వహించారు. సమీరా రెడ్డి, నీతూ చంద్ర, త్రిధా చౌదరి, మృణాల్ కుల్‌కర్ణి, అమిత్ సాద్‌లు కీలకపాత్రలు పోషించారు. నిఖిల్ నంద మోషన్ పిక్చర్స్, నీమ్ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ సినిమాను నిఖిల్ నందా, సంజయ్ దత్‌లు సంయుక్తంగా నిర్మించగా.. మే 15న ఆఖరి సవాల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. స్లాన్లే ముద్దా సినిమాటోగ్రాఫర్‌గా, సంజయ్ శుక్లా ఎడిటర్‌గా, మోంటీ శర్మ సంగీతం అందించారు.

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష
తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష

ఇవి కాకుండా మే 15న తెలుగులో ఆరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం: ది 1989 ఫైల్ కేస్.. హిందీలో ఐఐజెడ్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జాంబీస్, నవగుంజారా విడుదల కానున్నాయి. అలాగే మలయాళంలో అతిరాది, కన్నడంలో షేర్, లో నవీన.. ఇంగ్లీష్‌లో హోకుమ్, ఐరన్ మైడెన్ బర్నింగ్ ఎంబీషన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి వీటిలో ఏవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి.

Read more about: suriya movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X