This Week Movie Releases: లెనిన్, ధమాల్ 4, ఈవిల్ డెడ్ బర్న్.. ఈ వారం విడుదలయ్యే సినిమాలు ఇవే

గత వారం నాగబంధం, రావు బహదూర్, ఆల్ఫా వంటి భారీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి సందడి నెలకొంది. దీంతో జూలై రెండో వారంలో ఏ సినిమాలు విడుదల కానున్నాయి అనే దానిపై ఆసక్తి నెలకొంది. అక్కినేని అఖిల్ నటిస్తోన్న లెనిన్‌ మూవీ ఈ వారమే రిలీజ్ కానుంది. దీనితో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

This Week Movie Releases Lenin Dhamaal 4 Evil Dead Burn and More Films Hitting Theatres

లెనిన్
గత కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందిపడుతున్నారు అఖిల్ అక్కినేని. ఈసారి హిట్ కొట్టి రేసులోకి రావాలని ఆయన చేసిన సినిమాయే లెనిన్. మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్‌లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీలు సంయుక్తంగా లెనిన్ మూవీని నిర్మించారు. థమన్ సంగీతం అందించగా.. నవీన్ నూలీ ఎడిటింగ్, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జూలై 10న లెనిన్ వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

ధమాల్ 4
బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో ధమాల్ సిరీస్‌లో వస్తోన్న నాలుగో భాగం ధమాల్ 4. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, అర్షద్ వార్సి, రితేష్ దేశ్‌ముఖ్, జావేద్ జాఫ్రీ, రవికిషన్, సంజయ్ మిశ్రా, ఉపేంద్ర లిమాయే, అంజలి ఆనంద్, సంజీదా షేక్, ఈషా గుప్తా తదితరులు నటించారు. టీ- సిరీస్ ఫిల్మ్స్, మారుతి ఇంటర్నేషనల్, పనోరమా స్టూడియోస్ బ్యానర్లపై గుల్షన్ కుమార్, అజయ్ దేవగణ్‌, అశోక్ థాకారియా, ఇంద్రకుమార్, ఆనంద్ పండిట్ తదితరులు ఈ సినిమాను నిర్మించారు. సంజయ్ శుక్లా ఎడిటింగ్, సుధీర్ కుమార్ చౌదరి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. తన్సిక్ బాగ్చి, ఆదిత్య దేవ్, నీల్ కమల్ సింగ్ తదితరులు సంగీతం అందించారు. జూలై 4న వరల్డ్ వైడ్‌గా ధమాల్ 4 విడుదల కానుంది.

ఐ, నోబడి
మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మూవీ ఐ, నోబడి. పార్వతి తిరువోతు హీరోయిన్‌గా నటించారు. హక్కిం షాజహన్, విజయ రాఘవన్, మధుపాల్, శంకర్ రామకృష్ణన్, నక్షత్ర, ఐరా, నిశాంత్ సాగర్, నందు తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, ఈ 4 ఎక్స్‌‌పెరిమెంట్స్ బ్యానర్లపై సుప్రియా మీనన్, ముఖేష్ ఆర్ మెహతా, సీవీ సారథిలు ఈ సినిమాను నిర్మించగా.. నిషమ్ బషీర్ దర్శకత్వం వహించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. రమేశ్ ఎంబీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. జూలై 10న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

ఇదయం మురళి
కోలీవుడ్ స్టార్ హీరో అథర్వ నటించిన మూవీ ఇదయం మురళి. ఫహద్ ఫాజిల్ కీలకపాత్ర పోషిస్తుండగా.. కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రీతి ముకుందన్, నట్టి సుబ్రమణియం, రామ్‌కి, థమన్, జోనితా గాంధీ, అంజు కురియన్, చిన్ని జయంత్, సుధాకర్, ప్రగ్యా నగ్రా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. థమన్ సంగీతం అందించగా.. మనోజ్ పరమహంస, సీహెచ్ సాయిలు సినిమాటోగ్రాఫర్‌లుగా, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. జూలై 10 ఇదయం మురళి మూవీ విడుదల కానుంది.

ఇవి కాకుండా జూలై 10న తెలుగులో వసుదేవ సుతం, హిందీలో ఉత్తేజన: ది ఫైర్.. తమిళంలో లవ్ ఓ లవ్.. కన్నడంలో బాయ్స్ నెవర్ కాంప్రమైజ్, మదర్ ప్రామీస్.. మలయాళంలో వరవు.. ఇంగ్లీష్‌లో మోనా, ఈవిల్ డెడ్ బర్న్, ది ఇన్వైట్ సినిమాలు విడుదల కానున్నాయి. మరి వీటిలో ప్రేక్షకుల ఆదరణను ఏ సినిమాలు దక్కించుకుంటాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X