This week Releases కరీనా, అనుపమ, కీర్తీ సనన్ మీకోసం.. ఈవారం తెలుగు, తమిళం, హిందీ, మలయాళ మూవీస్ ఇవే!
భారతీయ సినిమా పరిశ్రమలో ఈ వారం మరోసారి చిన్న, పెద్ద సినిమాల సందడి భారీగానే కనిపించింది. మలయాళం, తమిళం, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో ఆసక్తికరమైన చిత్రాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఈ వారంలో అంటే మార్చి 28, 29వ తేదీన రిలీజ్ అవుతున్న ప్రాంతీయ, బాలీవుడ్ చిత్రాల వివరాల్లోకి వెళితే..
దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా అన్ని భాషల్లో డబ్బింగ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాపై పిల్లలు, పెద్దలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

మలయాళంలో
ఇక మలయాళంలో పృథ్వీరాజ్ సుమారన్ నటించిన గోట్ ఆఫ్ లైఫ్ సినిమా రిలీజ్ అవుతున్నది. దాదాపు 20 ఏళ్లకు క్రితం ప్రారంభమైన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు నోచుకొన్నది. నజీబ్ అనే వలస జీవి యదార్థ గాధగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ షోలు ప్రదర్శించగా.. పాజిటివ్ టాక్ నమోదైంది. ఇక మలయాళంలో గాడ్జిల్లా, గోట్ ఆఫ్ లైఫ్ కాకుండా వయస్సేథ్రయాయీ ముప్పతీ కూడా రిలీజ్ అవుతున్నది.

తమిళంలో
తమిళంలో మార్చి చివరి వారంలో ఎక్కువ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. గోట్ ఆఫ్ లైఫ్, గాడ్జిలా సినిమాలతోపాటు హాట్ స్పాట్, అలాగే పార్తీబన్, నందితా దాస్, దేవయాణి, వివేక్ నటించిన అజగీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా యోగిబాబు, ఓవియా, రోబో శంకర్ నటించిన బూమర్ అంకుల్ సినిమా, నేత్రు ఇందా నేరమ్, ఇది మిన్నల్ కాదల్, ఎప్పురా, వెప్పమ్ కులీర్ మజై, ది బాయ్స్ అనే సినిమాలు రిలీజ్‌కు ముస్తాబయ్యాయి.
కన్నడ సినీ రంగంలో
కన్నడ సినీ రంగంలో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సిద్దూ పూర్ణ చంద్ర, మమత రాహుత్ నటించిన తరిణి సినిమా, యువ రాజ్‌కుమార్, సప్తమీ గౌడ, అచ్యుత్ కుమార్, కిషోర్ కుమార్ నటించిన యువ చిత్రం మార్చి 29వ రిలీజ్ అవుతున్నది. వీటితోపాటు గోట్ ఆఫ్ లైఫ్, గాడ్జిల్లా వర్సెస్ కింగ్: ది న్యూ ఎంపైర్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.

హిందీలో
హిందీలో చిన్న సినిమాల హవా ఈ వారం కూడా కొనసాగుతున్నది. కరీనా కపూర్, టబు, కీర్తీ సనన్, దిల్జిత్, దోసాంజ్, కపిల్ శర్మ నటించిన క్రూ సినిమా మార్చి 29వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఇంకా తేజస్విని కొల్హాపూర్, గీతికా త్యాగి, అనంత్ మహదేవన్ నటంచిన యస్ పప్పా చిత్రం, దేవలీనా భట్టాచార్య నటించిన బెంగాల్ 1947 చిత్రం, స్నేహా ఉల్లాల్ నటించిన 3rd డిసెంబర్, రాజ్‌పాల్ యాదవ్ నటించిన వెలకమ్ వెడ్డింగ్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

తెలుగులో
తెలుగులో గాడ్జిల్లా, గోట్ ఆఫ్ లైఫ్ సినిమాలతోపాటు సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన డీజె టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ చిత్రం రిలీజ్ అవుతున్నది. అలాగే అగ్రికోస్ (అనగనగా ఒక రైతు), మార్కెట్ మహాలక్ష్మీ, తలకోన చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











