This Week Movie Releases: రావు బహదూర్, నాగబంధం, ఆల్ఫా... ఈ వారం భారీ చిత్రాల జాతర!

సరైన సినిమాల కోసం ఎదురుచూస్తోన్న వారికి ఈ వారం లవ్, కామెడీ, యాక్షన్, ఫాంటసీ, థ్రిల్లర్, సస్పెన్స్ సినిమాలు బరిలోకి దిగనున్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ వారం భారీ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ప్రధానంగా నాగబంధం, రావు బహదూర్, ఆల్ఫా చిత్రాలపై భారీ అంచనాలున్నాయి. వీటితో పాటు ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల వివరాలు పరిశీలిస్తే..

This Week Movie Releases Nagabandham Rao Bahadur Alpha amp amp More Films Hitting Theatres

నాగబంధం
అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డిలు నాగబంధం మూవీని నిర్మించగా.. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్, మహేశ్ మంజ్రేకర్, జగపతి బాబు, అనసూయ, మురళీ శర్మ తదదితరులు కీలకపాత్ర పోషించారు. ఎస్ సౌందర్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జునైద్ కుమార్, అభిలు సంగీతం అందించారు. ఆర్‌సీ ప్రణవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జూలై 3న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రావు బహదూర్
విలక్షణ నటుడు సత్యదేవ్ లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తోన్న మూవీ రావు బహదూర్. వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీచక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ+ఎస్ మూవీస్, బెటర్ ఇన్వెస్ట్ మీడియా విజన్ ఫండ్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చింతా గోపాల కృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఈశ్వరన్ విజయ రాఘవన్ తదితరులు నిర్మించారు. ఈ మూవీలో సత్యదేవ్ సరసన దీపా థామస్ హీరోయిన్‌గా నటిస్తుండగా వికాస్ ముప్పాల, బాల పరాశర్, అనంద్ భారతి, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు నటించారు. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. స్మరణ్ సాయి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోంది. జూలై 3న రావు బహదూర్ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

గట్టా కుస్తీ 2
గతంలో సూపర్‌హిట్‌గా నిలిచిన గట్టా కుస్తీ (తెలుగులో మట్టి కుస్తీ)కి సీక్వెల్‌గా తమిళంలో తెరకెక్కిన మూవీ గట్టా కుస్తీ 2.. తెలుగులో మట్టి కుస్తీ 2గా విడుదల కానుంది. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించారు. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై డాక్టర్ ఇషారి కే గణేష్, విష్ణు విశాల్‌లు సంయుక్తంగా నిర్మించారు. సియాన్ రోల్డన్ సంగీతం అందించగా, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా, కేఎం భాస్కరన్ సినిమాటోట్రాఫర్‌గా వ్యవహరించారు. జూలై 3న తెలుగు, తమిళ భాషలలో మట్టి కుస్తీ 2 సినిమా విడుదల కానుంది.

ఆల్ఫా
యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన మూవీ ఆల్ఫా. ఆలియా భట్, శర్వారీ, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు కీలకపాత్రలు పోషించగా శివ్ రావైల్ దర్శకత్వం వహించారు. రోహన్ష్ అండ్ అబీర్ సంగీతం అందించగా.. రూబీస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆరీఫ్ షేక్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ భారీ స్పై యాక్షన్ మూవీ జూలై 3న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

బేబీ డూ డై డూ:
విలక్షణ నటి హ్యూమా ఖురేషి లీడ్ రోల్‌లో నటించిన మూవీ బేబీ డూ డై డూ. సికిందర్ ఖేర్, చుంకీ పాండే, సీమా పహ్వా, రచిత్ సింగ్, విద్యా మాలవాడే, హిమాన్షు మాలిక్, మరుదర్ షెకావత్, అరుణ్ కుష్వావాలు నటించారు. నచికెత్ సామంత్ దర్వకత్వం వహించగా.. సలీమ్ సిబిలింగ్స్, పూణే 04 పిక్చర్స్ బ్యానర్లపై షకీబ్ సలీమ్‌లు నిర్మించారు. అర్జున్ అయ్యర్ సంగీతం అందించగా.. నిఖల్ పరిహర్, ఆశిష్ త్రిపాఠిలు ఎడిటింగ్.. టోజో గ్జేవియర్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. జూలై 3న బేబీ డూ డై మూవీ హిందీలో విడుదల కానుంది.

ఇవి కాకుండా జూలై 3న మలయాళంలో అరూపి, వరావు.. కన్నడంలో డెడ్లీ కిల్లర్, గ్రామాయణ, నామ్ కాల్దల్ హింగిరిల్లా బిడి.. ఇంగ్లీష్‌లో మినియన్స్ అండ్ మోనస్టర్స్, ది డెత్ ఆఫ్ రాబిన్‌హుడ్ సినిమాలు విడుదల కానున్నాయి. మరి వీటితో ఏ సినిమాలు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటాయో చూడాలి.

Read more about: Rao Bahadur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X