This week Movie Releases: పేట్రియాట్, కర, గాయపడ్డ సింహం.. ఈ వారం థియేటర్‌లలోకి ఎన్ని సినిమాలంటే?

చూస్తుండగానే ఏప్రిల్ నెల అయిపోయింది.. మరో నాలుగు రోజుల్లో మే నెలలోకి అడుగుపెట్టబోతున్నాం. కానీ థియేటర్‌లు మాత్రం వెలవెలబోతున్నాయి. పెద్ద సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటున్నారు. ఏప్రిల్ 30న రావాల్సిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది అనూహ్యంగా వాయిదా పడింది. దాంతో ఈ డేట్‌ను క్యాష్ చేసుకునేందుకు చిన్నాపెద్దా, డబ్బింగ్ సినిమాలు రంగంలోకి దిగనున్నాయి. మరి ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు ఏంటి అనేది పరిశీలిస్తే..

This Week Movie Releases Patriot to Gaayapadda Simham Kara and More Filims coming on Theaters

కర:
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన మూవీ కర. ధనుష్ సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్ బ్యానర్లపై డాక్టర్ ఇషారి కే గణేష్, కుస్మిత గణేష్‌లు సంయుక్తంగా నిర్మించగా.. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు. కేఎస్ రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎంఎస్ భాస్కర్, శ్రీజ రవి తదితరులు కీలకపాత్రలు పోషించారు. కర సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం వహించారు. థేనీ ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీజిత్ సారంగ్‌ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఏప్రిల్ 30న కర సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

కేడీ: ది డెవిల్
కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా, రీష్మ నానయ్య జంటగా నటించిన మూవీ కేడీ: ది డెవిల్. దిగ్గజ నటులు సంజయ్ దత్, వీ రవిచంద్రన్, రమేశ్ అర్వింద్, శిల్పాశెట్టిలు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. జిషుసేన్ గుప్తా, నోరా ఫతేహిలు ఇతర పాత్రలు పోషించగా.. కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ గెస్ట్ రోల్‌లో అలరించనున్నారు. విడుదలకు ముందు ఈ సినిమాలోని పాట వివాదాస్పదం కావడంతో కేడీ: ది డెవిల్‌పై అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

గాయపడ్డ సింహం:
దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా ఫరియా అబ్ధుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలకపాత్ర పోషిస్తున్నారు. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి మంథని, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పేట్రియాట్:
దశాబ్ధాలుగా మలయాళ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలాంటి మోహన్‌లాల్, మమ్ముట్టి దాదాపు 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన మూవీ పేట్రియాట్. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌లపై ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫాహద్ ఫాజిల్, కుంచకో బోబన్, నయనతార, దర్శన, రేవతి, రాజీవ్ మీనన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుశిన్ శ్యామ్ సంగీత దర్శకత్వం వహించగా.. మానుష్ నందన్ సినిమాటోగ్రాఫర్‌గా, మహేశ్ నారాయణన్, రాహుల్ రాధాకృష్ణన్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగు, తమిళ, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మే 1న పేట్రియాట్ మూవీ వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

ఏక్‌ దిన్:
లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఏక్ దిన్. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌ ఇందులో హీరోగా నటించారు. మన్సూర్ ఖాన్, అమీర్‌ఖాన్, అపర్ణ పురోహిత్‌లు ఈ చిత్రాన్ని నిర్మించగా.. సునీల్ పాండే దర్శకత్వం వహించారు. రామ్ సంపత్ సంగీత దర్శకత్వం వహించగా.. మనోజ్ లోబో సినిమాటోగ్రాఫర్‌గా, బల్లు సలౌజ ఎడిటర్‌గా వ్యవహరించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా మే 1న విడుదల కానుంది.

జెట్లీ:
టాలీవుడ్ కమెడియన్ సత్య హీరోగా నటిస్తోన్న మూవీ జెట్లీ. మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సత్య సరసన రియా సింఘా హీరోయిన్‌గా నటించింది. వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి, హేమలత ఈ జెట్లీ సినిమాను నిర్మించారు. కాల భైరవ సంగీతం అందిస్తుండగా.. సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరించారు. మే 1న జెట్లీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

నూరు సామి
నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ నటిస్తోన్న మూవీ నూరు సామి. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ నిర్మించారు. ఈ చిత్రంలో స్వాసిక హీరోయిన్‌గా నటించారు. అజయ్ దిశన్, లిజిమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. హరీశ్ యువరాజ్ ఎడిటర్‌గా, బాలాజీ శ్రీరామ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మే 1న ఈ సినిమా విడుదల కానుంది.

Read more about: Patriot Gaayapadda Simham
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X