This Week Movie Releases: ఈ వారం రిలీజయ్యే సినిమాలు.. పెద్ది నుంచి పరిమళ అండ్ కో వరకు మాస్ జాతరే!

ఎన్నో ఆశలు పెట్టుకున్న వేసవి ముగియడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు దాదాపు మూడు నెలల కాలం వృథా అయ్యింది. పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లలో సందడి కనిపించలేదు. దీంతో జూన్ నెలపై టాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో జూన్ 4, 5 తేదీలలో విడుదల కానున్న సినిమాలు పరిశీలిస్తే..

పెద్ది
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన మూవీ పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూన్ 4వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. పెద్దిలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్, బొమన్ ఇరానీ, రవికిషన్, సత్య, జాన్ విజయ్, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే, ఆడుకలామ్ నరేన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక స్టార్ హీరోయిన్ శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌తో అలరించనున్నారు.

This Week Movie Releases Peddi Hai Jawani Toh Ishq Hona Hai Bandar and more filims coming on theaters

హై జవానీ తో ఇష్క్ హోనా హై
డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ హై జవానీ తో ఇష్క్ హోనా హై. టిప్స్ ఫిలింస్ బ్యానర్‌పై రమేశ్ తౌరానీ నిర్మించారు. మౌనీరాయ, మనీష్ పౌల్, కుబ్రా సైత్, జిమ్మి షెర్గిల్, రాకేష్ బేడీ, చుంకీ పాండే, తనీషా శర్మ, సుప్రియ శుక్లా తదితరులు కీలకపాత్రలు పోషించారు. లవ్, రొమాన్స్, కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ జూన్ 5వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

బందర్
యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ హీరోగా తెరకెక్కిన మూవీ బందర్. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శాఫ్రాన్ మేజిక్ వర్క్స్ బ్యానర్‌పై అనురాగ్ కశ్యప్ నిఖిల్ ద్వివేది, శివి పండిట్, గౌరీ పండిట్‌లు నిర్మించారు. సాన్యా మల్హోత్రా, సప్నా పబ్బి, సబా ఆజాద్, ఇంద్రజిత్ సుకుమారన్, జితేంద్ర జోషి, రాజ్ బీ శెట్టి, నగేష్ భోస్లే, రిధి సేన్ తదితరులు బందర్‌లో కీలకపాత్రలు పోషించారు. జూన్ 5న ఈ సినిమా హిందీలో రిలీజ్ కానుంది.

పరిమళ అండ్ కో
సీనియర్ నటులు జయరామ్, ఊర్వశి కీలకపాత్రల్లో తెరకెక్కిన మూవీ పరిమళ అండ్ కో. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించగా.. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. మిస్కిన్, యోగిబాబు, సాండీ, సంతోష్ శోభన్, సంజనా కృష్ణమూర్తి, అనంతిక సానిల్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫ్యామిలీ, సస్పెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన పరిమళ అండ్ కో జూన్ 5న విడుదల కానుంది.

మ్యాంగో పచ్చ
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ మేనల్లుడు సంచిత్ సంజీవ్ హీరోగా లాంచ్ అవుతున్న మూవీ మ్యాంగో పచ్చ. సుప్రియాన్వి పిక్చర్ స్టూడియోస్, కేజీఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రియా సుదీప్, కార్తీక్, యోగి జీ రాజ్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా.. వివేకా దర్శకత్వం వహించారు. కాజల్ కుందేర్, ప్రశాంత్ హిరేమత్, మయూర్ పటేల్, జై. హరిణి శ్రీకాంత్, హంసా నారాయణ స్వామి, తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 5న మ్యాంగో పచ్చ విడుదల కానుంది.

మాలీవుడ్ టైమ్స్
మలయాళ స్టార్ హీరో నెల్సన్ నటించిన లేటెస్ట్ మూవీ మాలీవుడ్ టైమ్స్. షరాఫ్ యూ దీన్, సంగీత్ ప్రతాప్, రోషన్ శాన్వాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆషిక్ ఉస్మాన్ ఈ సినిమాను నిర్మించగా.. అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వం వహించారు. జేక్స్ బిజోయ్ సంగీత దర్శకత్వం వహించగా.. విశ్వజిత్ ఒడుక్కత్తి సినిమాటోగ్రాఫర్‌గా, నిధిన్ రాజ్ అరోల్, అభినవ్ సుందర్ నాయక్ ఎడిటర్‌గా వ్యవహరించారు. జూన్ 5న మాలీవుడ్ టైమ్స్ విడుదల కానుంది. పైన తెలిపినవి కాకుండా ఇంగ్లీష్‌లో స్కారీ, హీ మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ సినిమాలు జూన్ 5వ తేదీన రిలీజ్ కానున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలు ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంటాయో చూడాలి.

Read more about: peddi ram charan pooja hegde
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X