This Week Movie Releases: మా ఇంటి బంగారం, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు.. ఇంకా ఈ వారం విడుదలయ్యే సినిమాలు ఇవే

ఈ వారం మూవీ లవర్స్‌ను అలరించేందుకు సినిమాలు సరికొత్తగా తయారయ్యాయి. చిన్నా పెద్దా సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. తెలుగులో ఈ వారం మా ఇంటి బంగారం, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత అగ్ర కథానాయిక సమంత తెలుగులో ఫుల్ లెంగ్త్ మూవీలో నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో వడ్డే నవీన్ దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ ఇస్తున్నారు. మరి ఈ వారం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఏమేం సినిమాలు విడుదల కానున్నాయి. ఈ వివరాలు పరిశీలిస్తే..

This Week Movie Releases Samantha s Maa Inti Bangaram Vadde Naveen s Transfer Trimurthulu amp amp More Films Hitting Theatres

మా ఇంటి బంగారం
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత తెలుగులో ఫుల్ లెంగ్త్ పాత్రలో నటిస్తున్న మూవీ మా ఇంటి బంగారం. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాండ్ దువ్వూరులు కలిసి నిర్మించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు. జూన్ 19న మా ఇంటి బంగారం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు
ఒకప్పుడు ఫ్యామిలీ, లవ్, రొమాంటిక్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు వడ్డే నవీన్. కెరీర్ పీక్స్‌లో ఉండగానే నవీన్ ఎందుకో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ మరోసారి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అదే ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ సరసన యంగ్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కమల్ తేజ్ దర్శకత్వం వహిస్తుండగా.. శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, శ్రీనివాస్ వడ్లమాని, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా భాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 19న ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా విడుదల కానుంది.

నూరు సామి
సంగీత దర్శకుడిగా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించిన విజయ్ ఆంటోనీ.. హీరోగానూ వైవిధ్యమైన కథలు, పాత్రలతో అలరిస్తున్నారు. నకిలీ, బిచ్చగాడు, బేతాళుడు తదితర సినిమాలతో తమిళంతో పాటు తెలుగునాట మంచి ఫాలోయింగ్ సంపాదించారు విజయ్ ఆంటోనీ. ఆయన నటించిన తాజా చిత్రం నూరు సామి తెలుగులో వంద దేవుళ్లు పేరుతో విడుదల కానుంది. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మిస్తున్నారు. నూరు సామి మూవీలో శ్వాసిక హీరోయిన్‌గా నటించారు. అజయ్ దిశాన్, లిజిమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్, అరుల్‌దాస్, మున్షికాంత్, పడిని కుమార్, జెన్సన్ దివాకర్, బక్స్, వినోదిని, తమరై, కొడంగి వడివేలు తదితరులు కీలకపాత్రలు పోషించాగా శశి దర్శకత్వం వహించారు. ఎస్‌బీ దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రాఫర్‌గా, హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకత్వం వహించారు. జూన్ 19న నూరు సామి చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.

బాలన్ ది బాయ్:
మంజుమ్మల్ బాయ్స్ చిత్రంతో సంచలన విజయం అందుకున్న మలయాళ దర్శకుడు చిదంబరం తాజాగా తెరకెక్కించిన మూవీ బాలన్: ది బాయ్. కేవీఎన్ ప్రొడక్షన్స్, ది స్పెయిన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, శైలాజా దేశాయ్ ఫెన్‌‌లు సంయుక్తంగా బాలన్ ది బాయ్ చిత్రాన్ని నిర్మించారు. ఆదిశేషన్, ఫర్జానా పాలాతింగల్, మహమ్మద్ జినాన్, డాలీ జూన్, జీన్ పాల్ లాల్, గిరీష్ ఏడీ, బీనా ఆంటోనీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. షైజు ఖలీద్ సినిమాటోగ్రాఫర్‌గా, సుహాసినీ శ్యామ్ సంగీత దర్శకత్వం, వివేక్ హర్షన్ ఎడిటర్‌గా వ్యవహరించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో బాలన్ ది బాయ్ మూవీ జూన్ 19న రిలీజ్ కానుంది.

కాక్ టెయిల్ 2
షాహిద్ కపూర్, కృతిసనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మూవీ కాక్ టెయిల్ 2. హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ సినిమాను మద్దూక్ ఫిల్మ్స్, లవ్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌లపై దినేష్ విజాన్, లవ్ రంజన్, పరమిత ఆర్ విజాన్, అంకుర్ గార్గ్‌లు నిర్మించారు. కాక్ టెయిల్ 2కు ప్రీతమ్ సంగీత దర్శకత్వం వహించగా... అక్షర ప్రభాకర్ ఎడిటర్‌గా, శంతన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జూన్ 19న హిందీలో కాక్ టెయిల్ 2 రిలీజ్ కానుంది.

పైన తెలిపిన సినిమాలతో పాటు జూన్ 18న తెలుగులో మయూఖ.. జూన్ 19న చెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం, దీవాన, దిష్టి బొమ్మ, ఎల్‌జీబీటి- ఏ లీగల్ బ్యాటిల్ తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అలాగే తమిళంలో మను.. మలయాళంలో చిన్న చిన్న ఆశై, ఆజా సుందరి.. కన్నడంలో దొడ్డమనస, ఉరబ్బా, కాలాఘట్ట, ఎడ్యుకేటెడ్ బుల్స్.. ఇంగ్లీష్‌లో పాతాళ గుహ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X