This Week Theatrical Releases : కన్నప్ప, మార్గన్.. ఈ వారం థియేటర్లలోకి రాబోయే చిత్రాలివే!
ఈ వారం జూన్ 23 నుంచి జూన్ 29 వరకు థియేటర్లలోకి ఇంట్రెస్టింగ్ చిత్రాలు రాబోతున్నారు. టాలీవుడ్ నుంచి కన్నప్పతో పాటు మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. మరోవైపు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అదిరిపోయే సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.
మంచు విష్ణు కన్నప్ప..
మంచు విష్ణు నటించిన పౌరాణిక యాక్షన్ ఫిల్మ్ కన్నప్ప రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. మంచు మోహన్ బాబు, ఆర్. శరత్ కుమార్, అర్పిత్ రంకా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సప్తగిరి వంటి స్టార్-స్టడ్ తారాగణం ముఖ్య పాత్రల్లో నటించడం విశేషం. రూ.200 కోట్లతో రూపుదిద్దుకున్న ఈచిత్రం జూన్ 27న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ లోనూ విడుదల కాబోతోంది.
విజయ్ ఆంటోనీ మార్గన్..
కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'మార్గన్'. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ తమిళ భాషా క్రైమ్ థ్రిల్లర్ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో అజయ్ ధీషన్, సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడా సాగా, వినోద్ సాగర్ కీలక పాత్రల్లో నటించారు. ఒక సంక్లిష్టమైన హత్య కేసును చేధించే పోలీసు ఆఫీసర్ చుట్టూ కథ తిరుగుతుంది.

అనుపమా పరమేశ్వరన్ జేఎస్కే..
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ నటించిన తాజా చిత్రం జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (JSK). ప్రవీణ్ నారాయణన్ దర్శకుడు. మలయాళ భాషలో రూపుదిద్దుకుంది. సురేష్ గోపి ప్రధాన పాత్ర పోషించారు. మాధవ్ సురేష్ గోపి, శృతి రామచంద్రన్, దివ్య పిళ్లై కూడా నటించారు. జూన్ 27, 2025న విడుదల కానుంది.
అతణి..
కన్నడ భాషలో రూపుదిద్దుకున్న చిత్రం అథాణి. సమర్త్ ఎం దర్శకత్వం వహించారు. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్. ఈ చిత్రంలో సమర్త్ ఎమ్, మధు BC, శోభరాజ్, భవ్య, బాల రాజ్‌వాడి కీలక పాత్ర వహించారు. ఈ సినిమా కూడా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఆత్మ ప్రజలతో కలిసి తిరుగుతుంది. తన గ్రామంలో జరుగుతున్న హత్యల వెనుక రహస్యాన్ని వెలికితీసేందుకు ప్రయత్నించే నేపథ్యంలో కథ సాగుతుంది.
లవ్ మ్యారేజ్..
తమిళ భాషలో రూపుదిద్దుకున్న చిత్రం లవ్ మ్యారేజ్. ఈ చిత్రానికి షణ్ముగ ప్రియన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, సుష్మిత భట్, మీనాక్షి దినేష్, సత్యరాజ్, రమేష్ తిలక్, గజరాజ్ నటించారు. మధురైకి చెందిన 33 ఏళ్ల బ్రహ్మచారి చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రం కూడా జూన్ 27నే విడుదల కాబోతోంది.
గుడ్ డే..
తమిళ భాషలో తాజాగా రూపుదిద్దుకున్న కామెడీ ఫిల్మ్ గుడ్ డే. ఈ చిత్రానికి అరవిందన్ దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ రామలింగం, కాళి వెంకట్, మైనా నందిని, బోస్ వెంకట్, భగవతి పెరుమాళ్ నటించారు. ఒక ఉద్యోగి, అతని బాస్ మధ్య సాగే కథ ఇది. ఈ చిత్రం కూడా జూన్ 27నే విడుదల కాబోతోంది.
థ్యాంక్యూ యూ డియర్..
టాలీవుడ్ లో రూపుదిద్దుకున్న రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ థ్యాంక్యూ డియర్. ఈ చిత్రానికి తోట శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్ రఘుముద్రి, హెబా పటేల్, రేఖ నిరోష, రవి ప్రకాష్ నటించారు. సినిమా దర్శకుడు సత్యం, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ప్రియ మధ్య సాగే కథనే థ్యాంక్యూ డియర్. ఈ చిత్రం కూడా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.
కూడల్..
మలయాళ భాషలో రూపుదిద్దుకున్న మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ కూడల్. ఈ చిత్రానికి షాను కక్కూర్ దర్శకత్వం వహించారు. మూవీలో బిబిన్ జార్జ్, మెరీనా మైఖేల్ కురిసింగల్, వినీత్ తట్టిల్, విజిలేష్ కారయాద్, నియా వర్గీస్, రియా ఇషా కీలక పాత్రలు పోషించారు. ఇద్దరు అమ్మాయిలు క్యాంప్ కోసం వెళ్లి తమ చనిపోయిన క్లాస్మేట్ ను చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఈ చిత్రం కూడా జూన్ 27నే విడుదలకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











