Pushpa 2: సుకుమార్ చీటింగ్.. మైండ్ బ్లాకయ్యే సీన్స్ లేపేసిన సుక్కు, ఏకిపారేస్తోన్న అల్లు ఆర్మీ
చాలా కాలం తర్వాత యావత్ భారతీచ చిత్ర పరిశ్రమ మొత్తం కేవలం ఒకే ఒక్క సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అది కూడా మన తెలుగు సినిమా కోసం . ఆ చిత్రమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2". ఎప్పుడో 2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1 కి సీక్వెల్ గా ఇపుడు పార్ట్ 2 ను దర్శకుడు సుకుమార్ పుష్ప ది రూల్ అంటూ తీసుకొచ్చారు.
కాగా ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా ఊహించని బిజినెస్ ని జరుపుకొని ఎట్టకేలకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి దంచికొడుతోంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ అయ్యాక టాక్ బాగానే వచ్చింది కానీ చాలా మందికి ఇందులో పలు లూప్ హోల్స్ కూడా కనిపించాయి. సుకుమార్ అంటేనే మన తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి లాజిక్ అండ్ టేకింగ్ లో డిఫరెంట్ గా చూపించే దర్శకుడు అని టాక్ ఉంది.

అలాంటిది అతనే ఆడియెన్స్ ని మెయిన్ గా బన్నీ ఫ్యాన్స్ తమని మోసం చేసాడు అంటూ సినిమా చూసి వచ్చిన వారు సుకుమార్‌పై మండిపడుతున్నారు. పుష్ప 2 థియేటర్స్‌లో చూసిన తర్వాత చాలా మంది సినిమా థియేట్రికల్ ట్రైలర్ తో పలు షాట్స్ ని పక్క పక్కన పెట్టి మాట్లాడుతున్నారు. ట్రైలర్ లో ఉన్న చాలా షాట్స్ అసలు సినిమాలో ఎక్కడా లేవు అంటూ లాజిక్‌లు తీస్తున్నారు.
ముఖ్యంగా జపాన్ ఫైట్ లో అల్లు అర్జున్ నీటిలో నుంచి ఒక షిప్ తాలూకా లంగరు మీద నిలబడి ఉండే పోజ్ లేనే లేదు. అలాగే భన్వర్ సింగ్ షెకావత్ చేసిన ఫహద్ ఫాజిల్ ఒక నదిలో నుంచి బయటకి వచ్చే సీన్ లేదు. ఇంకా ఫహద్ ఫాజిల్ ఒక టేబుల్ మీద ఎక్కి డాన్స్ చేసే సన్నివేశం కూడా లేదు. ఇలా ట్రైలర్ లో చూపించిన చాలా షాట్స్‌ని సినిమాలో ఎందుకు పెట్టలేదు అంటూ సుకుమార్ పై చాలా విమర్శలు వస్తున్నాయి.

అయితే దీనికి కారణం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ థియేటర్స్ లో ప్రదర్శితం అవుతున్న చిత్రం ఏకంగా 3 గంటల 20 నిమిషాల రన్ టైం లో ఉంది. ఇవన్నీ లేకుండానే ఏదో ఒకటి చేసి ట్రిమ్ చేస్తేనే అంత వచ్చిందట. ఇక ఆ సీన్స్ కూడా పెట్టి ఉంటే నిడివి ఇంకా ఎక్కువ అయ్యిపోతుంది అని అందుకే అవన్నీ తీసేసినట్టుగా ఇపుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఇంకా పలు సీన్స్ అయితే పుష్ప పార్ట్ 3లో ఉంటాయని కూడా టాక్ ఉంది. సో సుకుమార్ ఎలాంటి మోసం చేయలేదు.. కేవలం నిడివి కోసమే ఆ సన్నివేశాలని తీసేసి ఉండొచ్చు అని వాదించే వారు కూడా ఉన్నారు. ఇక ఈ భారీ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా యంగ్ బ్యూటీ శ్రీలీల ఒక సూపర్ ఐటెం సాంగ్ లో కనిపించి మాస్‌ను ఊపేసింది.


Click it and Unblock the Notifications











