పవన్‌తో రొమాన్స్ చెయ్యాలని ఉంది .. యంగ్ హీరోయిన్ బోల్డ్ స్టేట్‌మెంట్
భారతదేశంలోని ప్రతి ఇండస్ట్రీకి చెందిన హీరోలలో ఒకొక్కరికీ ఒకో స్పెషాలిటీ ఉంటుంది. ఇలా తెలుగులో ఉన్న హీరోస్ ఆల్ మోస్ట్ అందరికీ కూడా ఏదొక రకంగా మంచి ఫాలోయింగ్ ఉన్న వారే ఉన్నారని చెప్పాలి. మన టాప్ హీరోస్‌నే తీసుకుంటే మాస్‌లో కొందరికి మంచి ఫాలోయింగ్ ఉంటే మరికొందరికి క్లాస్‌లో ఉంటుంది. ఈ రెండు కలిపి ఇంకొందరికి ఉంటుంది.
ఇక ఇవి కాకుండా కొందరికి అమ్మాయిల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇలాంటి హీరోస్ లో మన తెలుగు నుంచి ఒకపుడు శోభన్ బాబు, నాగార్జున, ఇపుడు మహేష్ బాబు అలాగే ప్రభాస్ ఇంకా అల్లు అర్జున్ అని ఉన్నారు. అయితే వీరితో పాటుగా ఇంట్రెస్టింగ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

పవన్‌కి ఒక్క మాస్‌లోనే అనుకుంటే లేడీ ఫ్యాన్స్ కూడా భారీగానే కనిపిస్తారు. పవన్‌కి బయట మాత్రమే కాకుండా సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖుల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కొందరు హీరోయిన్స్ అలాగే యాంకర్స్‌లోనూ పవన్‌కి అభిమానులు ఉన్నారు. అయితే ఓ యంగ్ బ్యూటీ అయితే పవన్ విషయంలో బాగా ఎగ్జైట్ అయ్యిపోతుంది.
రీసెంట్ గా మన తెలుగు హిట్ చిత్రం "భజే వాయు వేగం" లో యంగ్ హీరో కార్తికేయతో రొమాన్స్ చేసిన యువ బ్యూటీ ఐశ్వర్య మీనన్ చేసిన కామెంట్స్ ఇపుడు ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి. ఇపుడు సోషల్ మీడియాలో పలు ఏఐ చిత్రాలు బాగా హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ యంగ్ బ్యూటీ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక రొమాంటిక్ సీన్‌లో నటించినట్లుగా ఎవరో చేశారు. దీనితో ఈ పిక్‌ని ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ చాలా ఎగ్జైట్ అయ్యింది.

తనకి ఈ పిక్ చాలా నచ్చింది అని పవన్ కళ్యాణ్ తో ఇలా ఎవరు క్రియేట్ చేసారో కానీ వారికి థాంక్స్ చెబుతున్నాను అని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆమె పవన్ పై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా బయటకి వచ్చాయి. ఈమెకి పవన్‌తో రొమాన్స్ చెయ్యాలని ఉందని ఓపెన్ గానే చెప్పుకొచ్చింది.
పవన్ అంటే తనకి ఎప్పుడు నుంచో ఇష్టం అని ఐశ్వర్య చెప్పింది. ఖుషి సినిమాను తెలుగు, తమిళ్‌లో చూసానని తనకు అందులో పవన్ నటన ఎంతో ఇష్టమని ఆమె తెలిపారు. తనతో ఒక్కసారి అయినా స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుణ్ణు అని ఎపుడు నుంచో అనుకుంటున్నట్టుగా ఐశ్వర్య చెప్పారు.
మొత్తానికి పవన్ అంటే పడిచచ్చిపోయే అభిమానుల లిస్ట్ లో ఈ యంగ్ హీరోయిన్ కూడా చేరింది అని చెప్పాలి. ఈ హీరోయిన్ ఇపుడు తెలుగు సహా తమిళ్‌లోనూ పలు చిత్రాలు చేస్తుండగా ఓ పక్క పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా అలాగే భారీ సినిమా "హరిహర వీరమల్లు" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications











