NTR30: ఎన్టీఆర్ సినిమాలో తొలిప్రేమ నటి.. ఆ పాత్రలో సర్‌ప్రైజ్ చేయబోతుందిగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తూ అంచనాలను ఏర్పరచుకుంటోన్నాయి. అందులో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - బడా డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రూపొందుతోన్న చిత్రం ఒకటి అని చెప్పాలి. గతంలో 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న వీళ్లు.. ఇప్పుడు మరోసారి కలిశారు. అంతేకాదు, ఈ సారి ఏకంగా పాన్ ఇండియా చిత్రంతోనే రాబోతున్నారు. దీంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.
RRR మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివతో సినిమా చేస్తోన్న సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత నెలలోనే మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంకరపల్లిలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో పూర్తి చేశారు. ఆ వెంటనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను కూడా జరిపారు. ఈ రెండింటిలోనూ తారక్‌తో పాటు ముఖ్యమైన పాత్రలను చేస్తున్న స్టార్ల మధ్య కీలకమైన సీన్స్‌ను, యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు.

క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్లు భాగం అవుతోన్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇక, ఆమె తల్లి పాత్రను మాత్రం సీనియర్ నటి మణి చందన (తొలి ప్రేమ ఫేం) చేస్తున్నట్లు తాజాగా తెలిసింది. ఇప్పటికే ఆమె ఈ సినిమా షూటింగ్‌లో కూడా భాగం అయినట్లు సమాచారం. గతంలో ఆమె తెలుగులో 'నిజం', 'పిల్ల నచ్చింది', 'ఉంగరాల రాంబాబు', 'ఆచారి అమెరికా యాత్ర', 'బుర్రకథ', 'నాంది' వంటి చిత్రాలు చేసింది. వాటిలో మెప్పించడంతో ఇప్పుడు కొరటాల ఈ సినిమాకు ఆమెను ఎంపిక చేసుకున్నారని తెలిసింది.

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలిసి చేస్తున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











