Don't Miss!
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘తోలుబొమ్మలాట’ ఫస్ట్ లుక్: రాజేంద్రప్రసాద్ నుంచి మరో ప్రయోగం!
నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, వెన్నెల కిషోర్, హర్షిత కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'తోలుబొమ్మలాట'. సుమ దుర్గా క్రియేషన్స్ పతాకంపై దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా విశ్వనాథ్ మాగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జులై 19న రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా 'తోలుబొమ్మలాట' ఫస్ట్ లుక్‌ని పోస్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. జీవితమంటే ఒక తోలుబొమ్మలాట. ఎవరి ఆటను వాళ్లు ఆడి తీరాల్సిందే. కాకపోతే కొన్నిసార్లు ఆ ఆటలో చిక్కుముడులుంటాయి. వాటిని ఎంత అందంగా విప్పగలిగాం? మనవారిని వాటి నుంచి ఎంత గొప్పగా విడిపించగలిగాం అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన కథతో విశ్వనాథ్ మాగంటి ఈ సినిమా చేశారని తెలిపారు.
ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ సోమరాజు అనే పాత్రలో కనిపించబోతున్నారు. సోమరాజుకు గోలీ సోడాలంటే ఇష్టం. కాబట్టి అందరూ ఆయన్ని సోడాల్రాజు అని పిలుస్తుంటారు. ఆయన తన కుటుంబంలో వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించారనేది ఆసక్తికరంగా తెరకెక్కించారట.
రాజేంద్రప్రసాద్, విశ్వంత్, వెన్నెల కిషోర్, హర్షిత, దేవీ ప్రసాద్, నర్రా శ్రీనివాస్, నారాయణ రావు, సంగీత, కల్పన, శిరీష, చలపతి రావు, ప్రసాద్ బాబు, ధనరాజ్, పూజా రామచంద్రన్, తాగుబోతు రమేష్, జబర్దస్త్ రాజు, దొరబాబు, లక్ష్మణ్ మీసాల తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాత: దుర్గా ప్రసాద్ మాగంటి, రచన, దర్శకత్వం: విశ్వనాథ్ మాగంటి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: సురేష్ బొబ్బిలి, పాటలు: చైతన్య ప్రసాద్, కెమెరా: సతీష్ ముత్యాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ నూకవల్లి, ఆర్ట్: మోహన్ కుమార్.