Ayodhya Ram Mandir అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరుద్దంగా సినిమా ప్రదర్శన.. హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్ట్!
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం, సీతారాములు, హనుమంతుడి విగ్రహాల స్థాపన కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు భక్తి భావంలో మునిగిపోతుంటే.. మరో వైపు సంఘ విద్రోహ శక్తులు హైదరాబాద్‌లో హిందువులకు విరుద్ధంగా చర్యలు చేపట్టారు. రామ మందిరానికి విరుద్ధంగా సినిమా ప్రదర్శిస్తున్న వారిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ వివాదాస్పద సంఘటన వివరాల్లోకి వెళితే..
Recommended Video

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంటే.. మరో వైపు హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో కొందరు ఆకతాయిలు ఓ కేఫ్‌లో రామ్ కే నామ్ అనే సినిమాను ప్రదర్శించారు. ఈ విషయం తెలుసుకొన్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అక్కడికి హుటాహుటిన చేరుకొన్నారు.

సైనిక్‌పురిలోని ఓ కేఫ్‌లో రామ్ కే నామ్ సినిమాను ప్రదర్శిస్తున్న వారిని అడ్డుకొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హిందువుల మనోభావాలకు విరుద్దంగా రామ్ కే నామ్ సినిమాను ప్రదర్శిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
సైనిక్‌పురిలో జరిగిన సంఘటనను విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఖండించారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారు. వారిపై తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్‌లో రామ్ కే నామ్ పేరుతో ఉన్న డాక్యుమెంటరీని తొలగించాలని డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











